ముందస్తు రాబడి మస్తు

- బల్దియా ఎర్లీబర్డ్‌కు అనూహ్య స్పందన
- ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ
- ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం
- ఈ నెల 30 వరకే అవకాశం
గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఇళ్లు, వ్యాపార సముదాయాల యాజమానులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఏర్లీబర్డ్ సద్వినియోగం ద్వారా వేలాది రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఐతే, సదరు యాజమానులు కిందట ఏడాదికి సంబంధించి ఎలాంటి పన్ను బకాయి ఉండరాదు. పాత బకాయి ఉంటే ముందస్తు పన్ను చెల్లింపులో రాయితీకి అవకాశం ఉండదు. ఒకవేళ ఐదు శాతం రాయితీ పొందాలంటే పాత బకాయి, దానిపై నమోదైన ఆపరాధ రుసుం మొత్తం చెల్లిస్తేనే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, ఈ నెల 12 (సోమవారం) నాటికి 63713 మంది ఈ ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకోగా, వీరి ద్వారా రూ.32.29 కోట్ల మేర ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చుకున్నది. కాగా, ఇళ్ల యాజమానులు, వ్యాపార సముదాయాల వారు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న ఐదు శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గానూ రూ.లక్షల్లో పన్ను బకాయిలు ఉన్న యాజమానులు ఏడాది కాలం పన్ను ఒకేసారి చెల్లిస్తే రాయితీ కూడా రూ.వేలల్లో వస్తుందని, ఈ నెల 31 వరకు రాయితీ సదుపాయం ఉందని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

