వానాకాలం.. బల్దియా సిద్ధం

- గతేడాది అనుభవాల దృష్ట్యా అప్రమత్తం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నజర్
- రంగంలోకి మాన్సూన్ యాక్షన్ బృందాలు
- విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా కార్యాచరణ
- నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి మేయర్ కృషి
- నేడు మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది కురిసిన కుండపోత వర్షాలతో గ్రేటర్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు.
బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గ కార్పొరేటర్లతో సమావేశమైన మేయర్..గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నాలాల అభివృద్ధి, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రూ.858 కోట్లతో చేపడుతున్న నాలా అభివృద్ధి, శిథిల భవనాల కూల్చివేతలపై కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీలకతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతేడాది నీట మునిగిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన చేపట్టాలని, ఇదే సమయంలో ఈ వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నిత్యం పనుల పరిశీలన
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, మురుగునీటి కాల్వలు కలుపుకొని మొత్తం 884 కిలోమీటర్లు ఉంది. నాలాల మరమ్మతు, పూడిక తొలగింపు పనులను ఆరుగురు ఎస్ఈలతోపాటు ఆయా సర్కిళ్ల జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో సమన్వయం చేస్తూ మేయర్ పలు సూచనలు జారీ చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు!
ఒక్కో జోన్లలో రెండు బోట్ల కొనుగోలు
- సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో ఎలాంటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బల్దియా సన్నద్దమవుతున్నది.
- నాలాల పూడిక తీత పనులను తుది దశకు చేర్చిన అధికారులు మరో పక్క వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
- ఇందులో భాగంగానే కుండపోత వర్షాలతో వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నది.
- ఈ మేరకు జోన్ల వారీగా రెండు పడవల చొప్పున కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది.
- శేరిలింగంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలలో రెండింటి చొప్పున ఎల్బీనగర్ జోన్లో అత్యధిక వరద ముంపు ప్రాంతాలు ఉండటంతో ఇక్కడ నాలుగు బోట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
- ఒక్కో బోటును రూ.8 లక్షల చొప్పున 14 బోట్లకు రూ.1.12 కోట్లను వెచ్చిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

