GHMC | రహదారులపై మళ్లీ చెత్త డబ్బాలు.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
GHMC | గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి.
GHMC | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త పేరుకుపోతున్నది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)లో చెత్త లేకుండా చేసేందుకు మళ్లీ తెరపైకి బిన్లు (చెత్త డబ్బాలు)ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆరు జోన్ల పరిధిలో 477 జీవీపీ పాయింట్లను గుర్తించి 931 బిన్లు ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఇలంబర్తి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కటి 1100 లీటర్ల సామర్థ్యం ఉన్న బిన్లను జీవీపీ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఆర్ఎఫ్ఐడీ విధానంలో ఈ డస్ట్బిన్ల పర్యవేక్షణ జరగనుంది. బిన్లలో 70 శాతం చెత్త పడగానే ఆర్ఎఫ్ఐడీ సెన్సార్ ద్వారా ఆ రూట్లో ఉన్న స్వచ్ఛ వాహనం (చెత్త లిఫ్టింగ్ చేసే వాహనం) అలర్ట్ చేస్తుంది. దీంతో అటుగా వెళ్లే వాహనంలో ఈ బిన్లలో చెత్తను క్లియర్ చేయనున్నారు. తద్వారా గతంలో మాదిరిగా జీవీపీ పాయింట్ల వద్ద కుక్కలు, పశువులు చిందర వందర చేసే అవకాశాలు ఉండవని అధికారులు చెబుతున్నారు.
జోన్లవారీగా చెత్త బిన్లు ఏర్పాటు చేసే వివరాలు
ఎల్బీ నగర్ జోన్లో 46 జీవీపీ పాయింట్ల వద్ద 106 బిన్ల ఏర్పాటు
చార్మినార్ జోన్లో 136 జీవీపీ పాయింట్ల వద్ద 267 బిన్ల ఏర్పాటు
ఖైరతాబాద్ జోన్లో 76 జీవీపీ పాయింట్ల వద్ద 166 బిన్ల ఏర్పాటు
సికింద్రాబాద్ జోన్లో 91 జీవీపీ పాయింట్ల వద్ద 152 బిన్ల ఏర్పాటు
శేరిలింగంపల్లి జోన్లో 71 జీవీపీ పాయింట్ల వద్ద 130 బిన్ల ఏర్పాటు
కూకట్పల్లి జోన్లో 57 జీవీపీ పాయింట్ల వద్ద 110 బిన్ల ఏర్పాటు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- dustbin
- Garbage bins
- GHMC
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

