ఉప్పల్, జనవరి 31 : ఉప్పల్ నియోజకవర్గ అభ్యున్నతికి తమవంతు తోడ్పాటు అందిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో రూ.66 లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.38 లక్షలతో కమ్యూనిటీహాల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో రోడ్లు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణానికి నిధులు తీసుకువస్తున్నామని చెప్పారు. కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు.
ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి, ఏఈ వసంత, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, మేకల మధుసూదన్‌రెడ్డి, గరిక సుధాకర్, చింతల నరసింహారెడ్డి, మస్క సుధాకర్, నోముల మైస య్య, గొరిగె ఐలేశ్, శ్రీకాంత్, మల్లేశ్, అబ్బయ్య, రామస్వామి, దాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.