Fish | బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చేపలకు ఫుల్ గిరాకీ..
Fish | బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ ఆదివారం కోనుగోలుదారులతో కిటకిటలాడింది.
Fish | ముషీరాబాద్, ఫిబ్రవరి 23 : బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ ఆదివారం కోనుగోలుదారులతో కిటకిటలాడింది. నగర నలుమూలల నుంచి జనం చేపలు కొనుగోలు చేయడానికి రావడంతో చేపల మార్కెట్ రద్దీగా మారింది. మాములు రోజుల్లో 40 టన్నుల వరకు అమ్మకాలు సాగించే వ్యాపారులు ఆదివారం ఒక్క రోజు దాదాపు 60 టన్నుల చేపల విక్రయాలు జరిపినట్లు చెప్తున్నారు.
బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల కొనుగోలుకు గిరాకి పెరగడంతో వ్యాపారులు రేట్లు పెంచారు. మామూలు రోజుల్లో రవ్వు కిలో రూ. 140 ఉండగా ప్రస్తుతం రూ. 160 నుండి రూ. 180కి పెంచారు. అదేవిధంగా బొచ్చ కిలో రూ. 120 ఉండగా నేడు రూ. 140, కొర్రమీను మామూలు రోజుల్లో రూ. 450 ఉండగా ఆదివారం రూ. 550, రొయ్యలు రూ. 300 ఉండగా ఇవాళ రూ. 350 పలికినట్లు చేపల వ్యాపారులు చెప్తున్నారు.
బర్డ్ ప్లూ నేపథ్యంలో చేపల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడంతో వ్యాపారులు ధరలు పెంచారు. చేపలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున జనం రావడంతో మార్కెట్ పరిసరాలు రద్దీగా మారాయి. ముషీరాబాద్, సాగర్లాల్ ఆసుపత్రి, రాంనగర్, పార్శిగుట్ట మార్గాల వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

