హైదరాబాద్ : సోమాజిగూడలోని మ్యాక్సి విజన్ ఐ హాస్పిటల్లో ఉచిత కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం సోమవారం ప్రకటించింది. రేపట్నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని మ్యాక్సి విజన్ సీఈవో సుధీర్ పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 93900 35926 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.