జూబ్లీహిల్స్, మార్చి 12 : విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీంలో భాగంగా విదేశీ విద్య అర్హత పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టెప్‌ఇన్ లీడ్స్ అకాడమీ డైరెక్టర్ వంగూరి బ్రహ్మయ్య తెలిపారు. మార్చి 14న సూరారంలోని బాబూ జగ్జీవన్‌రామ్ ఫంక్షన్ హాల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 90304 63377, 98492 33523 సంప్రదించాలని కోరారు.