60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి
ఫోక్సో, లైంగిక దాడులకు సంబంధించి 60 రోజుల్లో కేసుల దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్లు వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్టేషన్ హౌస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- ఫోక్సో, లైంగిక దాడుల కేసులపై సమీక్ష నిర్వహించిన
- రాచకొండ సీపీ చౌహాన్
సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఫోక్సో, లైంగిక దాడులకు సంబంధించి 60 రోజుల్లో కేసుల దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్లు వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్టేషన్ హౌస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో, లైంగిక దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తు, పెండెన్సీలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జనవరి 20వ తేదీ నాటికి 253 కేసులను 63కి తీసుకుచ్చి వేగంగా కేసులను దర్యాప్తు చేసి 100శాతం కేసుల దర్యాప్తు చేస్తున్నారని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ విభాగం నుంచి రాచకొండ పోలీసులు ప్రశంసలందుకున్నారన్నారు.
కేసుల దర్యాప్తుతో పాటు నిందితులకు శిక్షల శాతాన్ని పెంచాలని, 2019లో 12, 2020లో 13, 2021లో 15, 2022లో 15 కేసులలో శిక్షలు పడ్డాయని, దీనిని మరింతగా పెంచాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు 100 శాతం కేసులను పరిష్కరిస్తూ నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో వివిధ విభాగాలతో సమన్వయం చేస్తూ, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా కమిషనరేట్‌లో మానిటరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమెన్ సేఫ్టి వింగ్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, సీసీఆర్బీ ఏసీపీ జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Foxo
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

