Formula E | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్ రేసు
Formula E | వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి.
Formula E | వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్ నగరవాసులను విజ్ఞప్తి చేశారు.

సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్, చాహల్, ధావన్ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు. కాగా కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది.
Formula E car Race at Hyderabad Photos
సాగరతీరాన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫార్ములా ఈ కార్ రేసు విజయవంతంగా ముగిసింది. జీన్ ఎరిక్ మొదటి స్థానంలో నిలిచాడు. విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. #HyderabadEPrix #FormulaE #WorldChampionShip #Hyderabad #HyderabadEMotorShow2023
@KTRBRS
#FormulaErace pic.twitter.com/reLS55g8Ac— Namasthe Telangana (@ntdailyonline) February 11, 2023
ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్..
ఫార్ములా ఈ రేస్ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక మీదట భారతదేశంలో నుంచి హైదరాబాద్ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.

పోటీల సందేశం ఇదే..
పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్ ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడినా ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక పోటీలు హైదరాబాద్ వేదికగా జరగడం విశేషం. 2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. 2014లో బీజింగ్‌లో ఈ రేస్ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో రేసు జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్లోజరుగనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

