All India Industrial Exhibition : తెలంగాణ అటవీ శాఖకు ప్రథమ బహుమతి
హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు తొలి బహుమతి వచ్చింది. తెలంగాణకు హరితహారం ద్వారా అటవీ శాఖ గత ఏడేళ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రదర్శించింది.
పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలను ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

అడవి థీమ్ తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారంతో పాటు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ జూ కూడా సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో హోమ్ మంత్రి మహబూబ్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధుల చేతులు మీదుగా అటవీ శాఖ అధికారులు బహుమతిని అందుకున్నారు. అటవీ శాఖ స్టాల్ ను చక్కగా నిర్వహించి, మొదటి బహుమతి గెల్చుకున్న అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

