హైదరాబాద్ : హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పాత భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పొగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ భవనంలోని కింది అంతస్తుల్లో బట్టల షాపులు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. pic.twitter.com/VH7qy6zBy1
— Namasthe Telangana (@ntdailyonline) May 17, 2022