హైదరాబాద్: హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో ఉన్న ఓ ఐస్క్రీం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గోదామ్ మొత్తం విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.