Fire Accident | మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ అగ్నిప్రమాదం కారణంగా కాలనీలో దట్టమైన పొగ వ్యాపించింది. ఎగిసిపడుతున్న మంటలు, కమ్మేసిన పొగతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు జీడిమెట్ల పారిశ్రామికవాడలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఓ డెకరేషన్ స్క్రాప్ గోదాంలో ఎగసిపడుతున్న మంటలు
పేలుడు దాటికి రోడ్డుపై ఎగిరి పడుతున్న కెమికల్స్ సాల్వెంట్ డ్రమ్ములు
పక్కనే ఉన్న అపార్టుమెంటులో పార్క్ చేసిన వాహనాలకు అంటుకున్న… pic.twitter.com/cmAzvnwnJ6
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026