రైతుబంధు ఏమాయే..?
వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
- మళ్లీ పాతపద్ధతి షురూ.. అప్పులు తెచ్చి సాగుచేస్తున్న రైతులు
- మేడ్చల్ జిల్లాలో 48,072 మంది రైతులు
- రైతుబంధు పడింది..29వేల రైతులకే
- మిగతా రైతుల పరిస్థితి ఏమిటీ.?
- సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం
మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 ఎకరాల రైతులకు మాత్రమే రైతుబంధు నగదు జమ కాగా.. మిగతా రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది.
జిల్లాలో మొత్తం 48,072 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 29వేల మంది రైతులకు మాత్రమే రైతుబంధు పడినట్లు సమాచారం. అయితే మిగతా రైతులకు రైతుబంధు నగదు జమ కాకపోవడంతో వరి పంట విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 13,400 ఎకరాలలో సాగు చేసేందుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం విధితమే. అయితే ఇప్పటి వరకే వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా పంట పెట్టుబడి సాయం అందక ఇంకా నాట్లు పూర్తికాలేదని రైతులు పేర్కొంటున్నారు.
గత యాసంగిలో రూ.36కోట్ల 67లక్షలు
గత యాసంగిలో పంట పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 48,072 మంది రైతులకు రూ.36కోట్ల 67లక్షల నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో రైతుబంధు నగదు జమ కాని రైతులు ప్రతి రోజు ఫోన్లలో మెస్సేజ్ కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

