‘సంపాదన’ యాడ్స్‌ను నమ్మకండి

- సైబర్ నేరగాళ్లకు చిక్కకండి
- మధ్యతరగతిని లక్ష్యం చేసుకున్న మోసగాళ్లు
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
కరోనా దెబ్బకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు.. దీంతో చాలా మంది ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా.. డబ్బు కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిని సైబర్‌నేరగాళ్లు అవకాశంగా తీసుకున్నారు.. ఉద్యోగాలులేక.. కష్టాల్లో ఉన్నవారికి వల వేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా, బల్క్ ఎస్ఎంఎస్లతో ఉద్యోగ ప్రకటనలు పెట్టి..ఆకర్షిస్తున్నారు.. ఆ ప్రటనలు చూసి..వారిని సంప్రదించేవారికి మాటలతో మంచి ఉద్యోగాలు, ఎక్కువ జీతం అంటూ నమ్మిస్తారు.. ఇందుకు మీ వద్ద స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది.. ఇవి ఉంటే ఇంటి వద్దనే ఉండి రోజుకు రూ.300 నుంచి రూ.3000 వరకు సంపాదించవచ్చు.. ఇలా సంపాదించి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.. నెలకు రూ.9 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకుని ప్రశాంతంగా ఉండండంటూ తమ వలలో చిక్కేలా మాటలతో మాయ చేస్తారు.. ఆ తర్వాత ఎవరైనా వారి వలకు చిక్కగానే.. కొన్ని వివరాలు సేకరిస్తారు.. మీకు పని అప్పగించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలని సూచిస్తారు… ఆ తర్వాత వర్క్ కోసం రూ.30 వేలు డిపాజిట్ చేయాలి.. ఈ డిపాజిట్ తిరిగి మీకు ఇచ్చేస్తామని నమ్మించి.. మోసాలకు పాల్పడుతున్నారు.
దీంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నవారు వెంటనే ఈ ప్రకటనలకు బోల్తాపడి.. వారు చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని.. పని అప్పగించడానికి కూడా డబ్బులు కట్టేస్తున్నారు. ఆ తర్వాత పని కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. ఎంతకీ పని రాకపోవడంతో ఆ ప్రకటనలోని నంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని సమాధానం వస్తున్నది. ఆ తర్వాత మోసపోయామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా చాలా మంది మధ్యతరగతివారు కరోనాతో నెలకొన్న పరిస్థితులు కష్టాలు తీరిపోతాయని భావించి.. ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. నెలకు ఎంతో కొంత డబ్బు వస్తుందనే ఆలోచనతో అప్పులు తెచ్చి మరి సైబర్ మోసగాళ్లకు డబ్బులు చెల్లించి.. మరిన్ని కష్టాలు కొని తెచ్చకుంటున్నారు.
డబ్బు అడిగితే.. అది మోసమే..
- కరోనా కాలంలో సైబర్ మోసాల బారినపడి ప్రజలు మరిన్ని కష్టాలను కొని తెచ్చకోవద్దు.
- సోషల్ మీడియా, ఫోన్లకు వచ్చే బల్క్ ఎస్ఎంఎస్లకు బోల్తా పడవద్దు.
- తాజాగా నెలకొన్న పరిస్థితులను సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని మధ్యతరగతి వాళ్లను నిండా ముంచుతున్నారు.
- మీకు ఇంటి నుంచే పని కల్పిస్తాం.. రోజుకు వందలు, వేలాది రూపాయల్లో సంపాదించవచ్చు అంటూ ఎర వేస్తారు.
- వాటిని నమ్మి రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర వాటికి డబ్బులు చెల్లించవద్దు.
- ముందుగా డబ్బు అడిగారంటే అది సైబర్ నేరమని గుర్తించండి.
- ఇటీవల వర్క్ ఫ్రం హోమ్ ప్రకటనలకు మోసపోయి.. 30 వేల నుంచి 60 వేల రూపాయల వరకు పోగొట్టుకుంటున్న ఫిర్యాదులు చాలా వస్తున్నాయి.
- ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు, ఉన్నత విద్యాభ్యాసం చదివిన గృహిణులు మోసపోతున్నారు. – హరినాథ్, ఏసీపీ సైబర్ క్రైం పీఎస్ రాచకొండ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cyber criminals
- fake
- fake job
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

