కోలుకున్నాకకసరత్తు చేయాల్సిందే!

- కొవిడ్ నుంచి బయటపడ్డా వ్యాయమం తప్పనిసరి
- పోషకాహారంతో పాటు తరచూ నీళ్లు తాగాలి
- నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి
- న్యూట్రీషనిస్ట్ శాలినీ భార్గవ్
కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. చాలామంది నెగెటివ్ రిపోర్ట్ రాగానే ఆరోగ్యంపై దృషి ్టపెట్టడం లేదు. అలా నిర్లక్ష్యంగా ఉంటే ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామంపై ముంబైకి చెందిన న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శాలినీ భార్గవ్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
3-4 లీటర్ల నీరు తాగాలి
నెగెటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకునేందుకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ శరీరానికి ఎప్పటికప్పుడు నీరందిస్తూ ఉండాలి. రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. దీంతోపాటు కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ తరచూ తీసుకుంటూ ఉండాలి.
నెగెటివ్ రాగానే.. వ్యాయమం వద్దు
- కొవిడ్ ప్రభావం అన్నింటికన్నా ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుంది.
- అందుకే అవి ఆరోగ్యంగా ఉండేలా తగిన వ్యాయామం చేయాలి.
- ఇందుకు యోగా, ప్రాణాయామం ఉత్తమమైనవి.
- ప్రాణాయామంతో శ్వాసకు సంబంధించిన నాడులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది.
- అలాగని నెగెటివ్ వచ్చిన వెంటనే వ్యాయామం మొదలు పెట్టకూడదు.
- దీంతో ఆరోగ్యం బాగుపడటం పక్కన పెడితే దెబ్బతినే అవకాశమే ఎక్కువ.
- ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. బీపీ, షుగర్ స్థాయి పరీక్షించుకోవాలి.
- అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాయామం మొదలుపెట్టాలి.
పంచదార తగ్గించండి
- వ్యాయామంతో పాటు సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
- తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, తగిన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి.
- సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి.
- పచ్చని కూరలు, ఉసిరి, నిమ్మ, ఆరెంజ్ తదితర విటమిన్ ‘సీ’ ఎక్కువగా ఉండే పండ్లు అధికంగా తినాలి.
- జంక్‌ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది.
- సాధ్యమైనంత వరకు పంచదార వాడకూడదు.
- దీనికి బదులు న్యాచురల్ షుగర్ ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.
మానసిక దృఢత్వం అవసరం
- కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరం.
- కరోనా వచ్చిన వారిని చూస్తూ చాలామంది మానసికంగా ఆందోళన చెందుతుంటారు.
- అలా కాకుండా మనసును ఇతర పనుల్లో నిమగ్నం చేసి ఉంచాలి.
- ఖాళీ సమయాల్లో తోచిన పని చేస్తూ ఉండాలి.
- వ్యాయామం చేస్తే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

