ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే కాలేరు
ప్రతి పౌరుడూ మొక్కలు నాటాలి | ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. సోమవారం అంబర్‌పేటలోని కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహరంలో భాగంగా పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, అడిషనల్ కమిషనర్ చౌహాన్, డీపీపీ రమేష్, అడిషనల్ డీసీపీ మురళీధర్, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి ఆయన హాజరైమొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వాతావరణ సమతుల్యతను కాపాడుతోందని అన్నారు. తమ వంతు బాధ్యతగా పోలీసులు కూడా మొక్కలు నాటుతున్నారని తెలిపారు. మొక్కల పెంపకంతో నేడు పోలీసు స్టేషన్లు ఆకుపచ్చని వనాల్లా మారుతున్నాయన్నాయని ప్రశంసించారు. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ…ఒకప్పడు పోలీస్ స్టేషన్లు అంటే కొందరికి అభద్రతా భావం కలిగి ఉండేదని నేడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.
పోలీస్ స్టేషన్లు పచ్చని అందాలతో ఆహ్లదకర వాతావరణానికి నిలయాలకు మారుతున్నాయని అన్నారు. ఇందుకు ఆయా పోలీస్‌స్టేషన్‌లో రకరకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ అనిల్‌కుమార్, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు విజయ్‌కుమార్, తులసీధర్చ శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్లు పేరం సుధాకర్, శ్రీనివాస్‌తో పాటు పలువరు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

