పోకిరీల మీ చేష్టలు.. రికార్డ్ అవుతున్నాయ్

- డెకాయ్ ఆపరేషన్లతో.. ఈవ్ టీజింగ్‌కు చెక్
- రన్నింగ్ బస్సు, మెట్రో రైలులోనూ షీ టీమ్స్
- కొత్త ఏడాది 112 మందిపై కేసులు
- 18 నుంచి25 ఏండ్లలోపువారే 75 మంది
- మళ్లీ పట్టుబడితే జైలుకు పంపమంటున్న కుటుంబ సభ్యులు
- హాట్‌స్పాట్స్‌పై పోలీసులకు సమాచారం ఇవ్వండి : సైబరాబాద్ షీ టీమ్స్
కొంతమంది పోకిరీలు ఎవరూ చూడటం లేదనుకుని రెచ్చిపోతున్నారు. అమ్మాయిలను అదేపనిగా వేధిస్తున్నారు. షీ టీమ్స్ బృందాలు దాదాపు 500 హాట్స్పాట్లలో దశల వారీగా డెకాయ్ అపరేషన్లు నిర్వహిస్తూ ఇలాంటి వారి భరతం పడుతున్నారు. హాట్ స్పాట్లోనే కాకుండా రన్నింగ్ బస్సులు, మెట్రో ట్రైన్, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ డెకాయ్ అపరేషన్ నిర్వహించి ఈవ్‌టీజింగ్‌ను అరికడుతున్నారు.
సైలెంట్‌గా రికార్డు చేస్తారు..!
పోకిరీల బెడద అధికంగా ఉండే బస్‌స్టాప్‌లు, కాలేజీల వద్ద షీ టీమ్స్ బృందాలు తిష్ట వేసి వారి వెకిలి చేష్టలను సైలెంట్‌గా రికార్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా సైబరాబాద్ షీ టీమ్స్ ఈ ఏడాది నాలుగు నెలల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో దాదాపు 112మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరి పై పెట్టీ కేసులు నమోదు చేసి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టుబడిన వారిలో మైనర్లు కూడా ఉండటంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం.. రాత్రి సమయంలోనే అధికం
- ముఖ్యంగా ఈ హాట్స్పాట్లలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పోకిరీలు తమ చేష్టలతో యువతులు, విద్యార్థినీలు, మహిళలకు విసుగు కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు.
- వారి చేష్టలను పోలీసులు గమనిస్తున్నారనే విషయం తెలియక ఓవర్ యాక్షన్‌కు పాల్పడుతున్నారు.
- షీ టీమ్స్‌కు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత వారిని పోలీస్ వ్యాన్ ఎక్కించగానే ఎక్కడ లేని వినయాన్ని ప్రదర్శించి నా తప్పు ఏమి లేదంటూ బుకాయించేందుకు ప్రయత్నిస్తారు.
- తీరా వీడియో చూపించగానే సారీ చెప్పుతున్నారు.
మళ్లీ దొరికితే జైలుకు పంపండి..
- ఇక కౌన్సెలింగ్ సమయంలో కుటుంబ సభ్యులు వారి పిల్లలు, పెద్దలు బయట చేస్తున్న వెకిలి చేష్టలను చూసి పరేషాన్ అవుతున్నారు.
- మరోసారి ఇలా చేయకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు.
- రెండో సారి దొరికితే జైలుకు పంపండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
- అయితే ఒక్క సారి షీ టీమ్స్‌కు ఈవ్‌టీజింగ్ కేసుల్లో దొరికిన వారు మరోసారి దొరకడం లేదని షీ టీమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
- మొదటి సారి పట్టుబడిన సమయంలో వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు.
- ఈవ్‌టీజర్స్ డాటాబేసులో పేర్లను నమోదు చేస్తున్నారు.
- దీంతో ఎక్కడైనా పట్టుబడినప్పుడు ఒక క్లిక్‌తో గతంలో ఏమైనా ఈవ్‌టీజింగ్ కేసుల్లో పట్టుబడ్డారా అనే విషయం స్పష్టం తెలిసిపోతున్నది.
- ఇలాంటి వేధింపులకు గురయ్యే స్పాట్స్ ఏమైనా ఉంటే డయల్ 100 ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Eve teasing
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

