ఓయూలో పెన్‌డౌన్
ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది.
- సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 28: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. తమ ఆందోళనల్లో భాగంగా ఉద్యోగులు అన్ని కళాశాలలు, కార్యాలయాల్లో పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పెన్‌డౌన్, టూల్‌డౌన్ బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను చాటారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2001 నుంచి 2004 మధ్య నియమితులైన అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2004 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేయాలని కోరారు. అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. టైంస్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.పది వేల నుంచి రూ.30 వేలకు పెంచాలన్నారు. గత కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, వాటిని పరిష్కరించకపోవడంతోనే దశలవారీగా నిరసనలకు దిగినట్లు చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సైతం తమ పెన్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

