వేతన కానుక.. అంతటా వేడుక

30 శాతం ఫిట్మెంట్.. వయో పరిమితి 61 ఏండ్లకు పెంపు..ఇలా ఊహించిన దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో వేతన జీవుల ఇంట సోమవారం ఆనందాల పంట పండింది. దిల్దార్ కేసీఆర్.. జయహో కేసీఆర్ అంటూ.. కీర్తించారు. క్షీరాభిషేకాలతో అభిమానాన్ని చాటారు. మనసున్న మహరాజుకు అభినందనల మాలతో నీరాజనాలు పలికారు. పటాకులు కాల్చి.. స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ‘ఇది మాకు పండుగ రోజు’
అని చెప్పిన ఉద్యోగులు.. సర్కారుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. 30 శాతం ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచి.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సిబ్బంది మరింత కష్టపడి పనిచేసి.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నా. సిటీ పోలీసులు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి.. హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలి. – నగర సీపీ అంజనీకుమార్
ఉద్యోగుల సమస్యలు స్వయంగా తెలుసుకొని.. వారి కష్టాలను తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన పెంచింది మా వేతనాలు కాదు.. మా జీవితాలకు వెలుగునిచ్చారు. ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచడం ఉద్యోగులకే కాదు, వారి కుటుంబాలను కూడా ఆదుకున్నట్లే. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. – జి. బాల నరేందర్, జీహెచ్ఎంసీ ఉద్యోగి
వీరంతా అంగన్వాడీ టీచర్లు.. ఎన్జీవో, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ టీచర్లకూ ఫిట్మెంట్ వర్తింపజేయడంతో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఇలా క్షీరాభిషేకం చేసి.. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ అసోసియేషన్ (టీఎన్జీవో) మేడ్చల్ జిల్లా కార్యదర్శి జమున తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌ను జాతిపితగా జీవితాంతం కొలుస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అసెంబ్లీ వేదికగా సోమవారం సీఎంకేసీఆర్ 30శాతం ఫిట్మెంట్తో పాటు ఉద్యోగ విరమణ వయస్సును 61ఏండ్లకు పెంచడం, ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే గ్రాడ్యుటీని రూ.16లక్షలకు పెంపు వంటి నిర్ణయాల ప్రకటనతో పలు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయా ల వద్ద పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఉద్యోగులు స్వీటు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులపై ఉన్న ప్రేమను చాటుకున్నారన్నారు.ఈ నిర్ణయంతో ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫిట్‌మెంట్‌ను వర్థింపజేస్తున్నట్లు వెల్లడించి కేసీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

