మొబైల్ యాప్ నుంచే విద్యుత్ సేవలు
కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా... లోడ్ ఛేంజ్ చేసుకోవాలన్నా... ఇలా సేవ ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే మొబైల్ యాప్ నుంచే సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) శ్రీకారం చుట్టింది.
- కొత్త కనెక్షన్ నుంచి ఫిర్యాదుల దాకా మొబైల్లోనే..
సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా… లోడ్ ఛేంజ్ చేసుకోవాలన్నా… ఇలా సేవ ఏదైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే మొబైల్ యాప్ నుంచే సేవలను పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) శ్రీకారం చుట్టింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటోంది. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్వీయ పర్యవేక్షణలో అప్డేటెడ్ వెర్షన్లో మొబైల్ యాప్‌ను వాడుకలోకి తీసుకువచ్చారు.
విద్యుత్ వినియోగదారులు తమ బిల్లుల చెల్లింపు, విద్యుత్ వాడకం, హిస్టరీ తెలుసుకోవడంతో పాటు సరఫరాలో ఉండే సమస్యల పరిష్కారం, విద్యుత్‌లో అంతరాయం, ఓల్టెజ్ హెచ్చు తగ్గులు, మీటర్ సమస్యలు, కొత్త మీటర్ మంజూరు, బిల్లింగ్ సమస్యలు, నూతన సర్వీసుల కేటగిరీలో గ్రీన్ టారిఫ్, సోలార్ రూఫ్ టాప్ దరఖాస్తు వంటి వాటిని జోడించారు. వీటితో పాటు పేరు మార్పు, చిరునామా మార్పు, కేటగిరీ మార్పు, అదనపు లోడ్, లైన్ షిఫ్టింగ్ వంటి వాటిని మొబైల్ యాప్ ద్వారా పొందేలా దీన్ని రూపొందించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూఎస్సీ నంబరు నమోదు చేయడం ద్వారా అన్ని రకాల సేవలను పొందేలా దీన్ని రూపొందించారు.
మొబైల్ యాప్ నుంచే ఫిర్యాదులు..
విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినా, ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేలా యాప్‌ను రూపొందించారు. విద్యుత్ చార్జీలకు సంబంధించిన టారిఫ్ వివరాలు, భద్రతకు సంబంధించిన సూచనలను అరచేతిలోని మొబైల్ యాప్ నుంచే సులభంగా పొందేలా టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్‌ను ఆధునీకరించి అందుబాటులోకి ఉంచారు. దాదాపు పది లక్షల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా అరచేతిలోనే విద్యుత్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం, సేవలను పొందేలా ఈ యాప్‌ను ఆధునీకరించారు. మొబైల్ యాప్‌తో పాటు వెబ్సైట్లోనూ ఆన్లైన్ సేవలను సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

