Slab collapse | బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మృతిచెందారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (60), అతడి అల్లుడు పరుసైన వివేక్ (30)లు ఎలక్ట్రిషియన్లుగా పనిచేస్తున్నారు.
కుందన్‌బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్మెంట్ యజమాని ద్వారకాప్రసాద్ ఎలక్ట్రీషియన్ పనుల కోసం వారిని పిలిపించాడు. పనుల కోసం ముగ్గురు కలిసి మూడో అంతస్తుకు వెళ్లారు. అక్కడ బాల్కనీ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ముగ్గురు కిందపోయారు.
ఈ ఘటనలో దేవీదాస్, వివేక్ లు అక్కడికక్కడే మృతిచెందగా, యజమాని ద్వారకా ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురికి తరలించారు. యజమాని ద్వారకా ప్రసాద్ స్థానిక ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!