ఫోర్జరీపై డిస్కంలో చర్చ
విద్యుత్‌శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంతో పాటు ఎస్పీడీసీఎల్లో ఈ కథనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
- నమస్తే తెలంగాణ కథనంపై అధికారుల ఆరా
- డిజిటల్ సంతకాల ఫోర్జరీతో నకిలీ ధ్రువపత్రాలు
- సీరియస్ అయిన సీఈఐజీ నందకుమార్
- కాంట్రాక్టర్లు, సిబ్బంది నుంచి వివరాల సేకరణ
- చర్యలు తీసుకుంటామని చెప్పిన నందకుమార్
సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : విద్యుత్‌శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంతో పాటు ఎస్పీడీసీఎల్లో ఈ కథనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు డాక్యుమెంట్‌పై డిజిటల్ సంతకాలు ఉన్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవి ఎలా ఫోర్జరీ జరిగాయనే దిశగా ఉన్నతాధికారులు ఆరా తీశారు. తాము డ్రాయింగ్ అప్రూవల్స్ ఇస్తేనే కనెక్షన్లు .. ఇవ్వాల్సిన విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లతో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుకుంటూ నకిలీ అప్రూవల్స్కు కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇవి ఎంత మంది కాంట్రాక్టర్లు చేశారు.. ఎప్పటినుంచి చేశారనే కోణంలో సీఈఐజీ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
ఎనిమిది నెలలుగా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు. అందులో బహుళ అంతస్తుల భవనాలు ఎన్ని, పరిశ్రమలు, మల్టీ కాంప్లెక్స్‌లు ఇతర వివరాలను కోరుతూ టీజీఎస్పీడీసీఎల్కు సీఈఐజీ లేఖ రాయనున్నట్లు తెలిసింది. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో కీలక పాత్రధారులైన ఇద్దరు కాంట్రాక్టర్లను సీఈఐజీ పిలిచి అసలు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. తమకేం తెలియదని చెప్పినప్పటికీ వారు తీసుకున్న అప్రూవల్స్కు సంబంధించి క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే వివరాలు రావడం లేదని, ఇది ఎలా జరిగిందంటూ సీఈఐజీ నందకుమార్ ప్రశ్నించారు. దీనికి వారు ఎలాంటి సమాధానమివ్వలేదని తెలిసింది. తనిఖీల అధికారి కార్యాలయం నుంచి అప్రూవల్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ దక్షిణ డిస్కంకు చెందిన కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై అడ్డగోలుగా కనెక్షన్లు ఇచ్చారని తెలుస్తోంది.
డిస్కం ప్రధాన కార్యాలయంలో చర్చ..
నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయంలో చర్చ జరిగింది. కాంట్రాక్టర్లు కనెక్షన్లు కావాలంటూ దరఖాస్తు చేసుకుంటే నానాతిప్పులు పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న అధికారులు కొందరు ఈ వ్యవహారంలో తమకు నచ్చిన కాంట్రాక్టర్ల నుంచి తనిఖీఅధికారి డిజిటల్ సంతకంతో వచ్చిన నకిలీ ధ్రువీకరణలను అనుమతిస్తూ వారికి కనెక్షన్లు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చారని విచారణలో తేలినట్లు సమాచారం. ఈ అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఈఐజీ నందకుమార్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌కు సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కాంట్రాక్టర్ల విషయంలో ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. వచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లతో ఇలా ఎందుకు చేశారని, నకిలీలకు కార్యాలయంలో ఎవరు సహకరించారని అడగగా వారు నోరు మెదపలేదు.
తాము రాకముందు జరిగిన ఈ బాగోతానికి సూత్రధారులెవరనే కోణంలో విచారించినట్లు సమాచారం. అయితే తామేమైనా డబ్బులడిగామా.. ఎందుకు ఇలా ఫోర్జరీ లెటర్లు పెట్టడం.. ఇలా చేస్తే వినియోగదారులకు నష్టం జరుగుతుంది కదా అంటూ సీఈఐజీ నందకుమార్ ఆ కాంట్రాక్టర్లను తీవ్రంగా మందలించారు. ఇదే సమయంలో సీఈఐజీ కార్యాలయంకు చెందిన ఒక ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సహకారంతో ఈ బాగోతమంతా నడిచిందని, ఆయనపై గతంలో అనేక ఆరోపణలు వచ్చినా తనకున్న రాజకీయ అండదండలతో కార్యాలయాన్ని నడిపిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఈ నకిలీ లెటర్లు తయారు చేసిన కాంట్రాక్టర్లు ఆ అధికారితో కలిసి కార్యాలయ సిబ్బంది సహకారంతో , ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లతో కుమ్ముక్కై మొత్తం వ్యవహారాన్ని నడిపించారని దక్షిణడిస్కం ప్రధానకార్యాలయంలో అధికారుల మధ్య గుసగుసలు వినిపించాయి.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
మా కార్యాలయ అధికారుల డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేయడం ఆశ్చర్యమనిపించింది. లోతుగా విచారణ జరుపుతున్నాం. మేం బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఇలా జరిగినట్లుగా తెలిసింది. అదే విషయంపై ఇప్పటికే కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడాం. వారి నుంచి కొన్ని వివరాలు సేకరించాం. అయితే డిజిటల్ సంతకం ఎలా ఫోర్జరీ చేస్తారనే విషయంలో కొన్ని అనుమానాలున్నప్పటికీ అసలు అప్రూవల్స్ నకిలీవి కావడంతో వాటిని ఎస్పీడీసీఎల్ అధికారులు ఎలా ఒప్పుకున్నారనే విషయంపై చర్చిస్తున్నాం.బాధ్యులైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
-నందకుమార్,సీఈఐజీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

