ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విడుదల చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ విధిగా నియమ, నిబంధనలను పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సూచించారు.
- ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్, సువిధ కేంద్రం
- ఫ్లయింగ్ స్వాడ్స్, వీడియో సర్వేలైన్స్ టీంలు..
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటర్లు 5,66,814 మంది
- పురుష ఓటర్లు 2,96,017, మహిళా ఓటర్లు 2,70,696
- ఇతర ఓటర్లు101, సర్వీస్ ఓటర్లు50
ఎల్బీనగర్, అక్టోబర్ 14: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విడుదల చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ విధిగా నియమ, నిబంధనలను పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సూచించారు. ఎల్బీనగర్ రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 84 మంది అధికారులను, 48 మంది రూట్, సెక్టోరియల్ అధికారులను నియమించారు.
హెల్ప్ డెస్క్..
ఎన్నికల కంట్రోల్ రూం, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 04024140937, 1950లో సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు.
సువిధా కేంద్రం..
సింగిల్ విండో క్లియరెన్స్ కోసం రిటర్నింగ్ కార్యాలయంలో సువిధ కేంద్రం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాల అనుమతులను సువిధా కేంద్రం ద్వారా క్లియర్ చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న 24 గంటల్లోనే క్లియర్ చేయనున్నారు.
సర్వేలైన్స్ టీంలు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కోసం సర్వేలైన్స్ టీంలను రిటర్నింగ్ అధికారి పంకజ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 6 ఫ్లయింగ్ స్వాడ్ టీంలు ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఒక ఆర్మ్డ్ పోలీసు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. నియోజకవర్గం వ్యాప్తంగా సంచరిస్తూ రాజకీయ పార్టీల కదలికలను, ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై కొరడా జూలిపించేందుకు విధులు నిర్వహిస్తారు. అదే విధంగా వీడియో సర్వేలైన్స్ టీంలు మరో 3 పనిచేయనున్నాయి. అదే విధంగా మరో వీడియో వీవింగ్ టీం కూడా అందుబాటులో ఉండి మేజర్ పొలిటికల్ ర్యాలీలు, మీటింగ్‌లపై నిఘా పెడతారు. అదే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను మిస్యూస్ చేసినా, ప్రభుత్వ భవనాలు, గెస్ట్‌హౌజ్‌లు, వాహనాలు వాడినా చర్యలు తీసుకుంటారు.
ఎల్బీనగర్లో ఓటర్ల సంఖ్య 5,66,816
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 5,66,814 మంది నమోదయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు పక్రియను చేపట్టిన ఎన్నికల అధికారులు తాజాగా ఎల్బీనగర్ నియోకవర్గం ఓటర్ల సంఖ్య వెల్లడించారు. పురుష ఓటర్లు 2,96,018 మంది కాగా, మహిళా ఓటర్లు 2,70,697 మంది ఉన్నారు. ఇక ఇతర ఓటర్లు 101 మంది ఉన్నట్లుగా ఓటరు లిస్టుల్లో నమోదయ్యారు. వీరితో పాటు సర్వీస్ ఓటర్లు మరో 50 మంది ఉన్నారు. మొత్తం పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ 6064 మందిగా పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 12, అదే విధంగా 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 8385, యువ ఓటర్లు (18 నుంచి 19 ఏండ్లు) 8566 మంది ఉన్నట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ప్రకటించారు. ఎన్నికల పక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు.. ఎన్నికల కోసం నియోజకవర్గంలో ఏర్పాట్లపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్ల పరిధిలోని 235 ప్రాంతాల్లో 570 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను అధ్యాయనం చేస్తున్నారు. ఓటర్ల కోసం అన్ని సదుపాయాలు కలిగిన భవనాలనే ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా అధికారులు నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రార్థనా మందిరాలు, ప్రైవేటు స్థలాల్లో యజమానులకు సమాచారం లేకుండా ఎలాంటి రాజకీయ అవరాలకు వాడుకోరాదు. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాల నుంచి 84 మంది అధికారులు పనిచేస్తున్నారు. 48 మంది రూట్, సెక్టోరియల్ అధికారులను నియమించాం. నియోజకవర్గంలో 6 ఫ్లయింగ్ స్వాడ్ , 3 వీడియో సర్వేలైన్స్ టీం, వీడియో వీవింగ్ టీంలను ఏర్పాటు చేశాం. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌డెస్క్‌ను, సువిధా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
– పంకజ, ఎల్బీనగర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

