Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఎలక్షన్స్ ఎప్పుడంటే..
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 11 వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.
తాజా షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు.

Jubileehills by election details
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు జూబ్లీహిల్స్ సీటు ఆశిస్తున్నారు. కానీ వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

