Election Code | గచ్చిబౌలి పరిధిలో వాహనాల తనిఖీ.. రూ.5కోట్లు సీజ్ చేసిన పోలీసులు..!
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో భారీగా నగదు పట్టుబడుతున్నది. గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో భారీగా నగదు పట్టుబడుతున్నది. గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

