Auto driver | రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఆటోలో ఎక్కి షో ఆఫ్ మాత్రం చేస్తారు : ఆటోడ్రైవర్
Auto driver | సీఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినం. ఆర్టీవో పని చేయదు.. ఆర్టీవో కమిషనర్ పట్టించుకోడు. వీళ్లు డ్యూటీలు చేస్తలేరా..? వీళ్లకు ఏం చేయాలో తెల్వదా..? జీతాలు ఒక్కటే లేపుకుంటరా.. అని మండిపడ్డాడు.
Auto driver | ఎంజే మార్కెట్లో ఆటోడ్రైవర్లు శనివారం ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యాడు. హైదరాబాద్ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ సిటీలో బండి నడపాలంటే మేం పర్మిషన్ కోసం రూ.2.50 లక్షలు ప్రభుత్వానికి కడుతున్నం. జిల్లాల్లో నడిపించే బండ్లకు 60 కిలోమీటర్ల పరిధి ఉంటది. ఆ బండికి రూ.2.45 లక్షలు కడ్తరు. మేం కేవలం పర్మిట్కే రూ.2.50 లక్షలు, బండికి మరో రూ.2.50 లక్షలు కడుతున్నం. మొత్తం రూ.5 లక్షల నుంచి 7 లక్షల దాకా మాకు సిటీ బండి పడుతుంద.
రేవంత్ రెడ్డి రూ.12 వేలు వద్దు, 12 పైసలొద్దు. అదే రూ.12వేలు తీసుకుపోయి మావి కూడా కలిపి జిల్లా బండ్లున్నోళ్లకు ఇవ్వండి. కానీ వాళ్లు మాత్రం ఇక్కడ తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్లిక్కడ తిరగాలంటే మా రూ.2.50 లక్షలు మాకన్నా ఇయ్యాలే లేకపోతే వాళ్లను సిటీ నుంచి బయటకన్నా పంపియ్యాలే. ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి జరగాలన్నాడు.
మా కుటుంబ పరిస్థితి మంచిగుంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడ్తం. సీఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినం. ఆర్టీవో పని చేయదు.. ఆర్టీవో కమిషనర్ పట్టించుకోడు. వీళ్లు డ్యూటీలు చేస్తలేరా..? వీళ్లకు ఏం చేయాలో తెల్వదా..? జీతాలు ఒక్కటే లేపుకుంటరా.. అని మండిపడ్డాడు. వాళ్లు పనిచేయకపోవడం వల్ల సామాన్యుడు సచ్చిపోతుండు. దానికి ఎవరిది బాధ్యత ఆర్టీవో కమిషనరా.. మంత్రి పొన్నం ప్రభాకరా.. సీఎం రేవంత్ రెడ్డినా..? అని ప్రశ్నించాడు.
రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఆటోలో ఎక్కి షో ఆఫ్ మాత్రం చేస్తారు.. కానీ మాకు సమస్య ఉంటే ఒక్కడు మాట్లాడడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
వాని రూ.12 వేలు మాకొద్దు.. మా రూ.12 వేలు కూడా తీసుకుపోయి డిస్ట్రిక్ట్ ఆటో వాళ్లకి ఇవ్వమనండి
డిస్ట్రిక్ట్ ఆటోలు మాత్రం ఇక్కడ తిరగొద్దు.. లేదా మేము పర్మిట్ కోసం కట్టిన రూ.2.5 లక్షలు మాకు ఇచ్చేయండి
ఆర్టీవో వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు.. దీనికి బాధ్యులు ఎవరు, పొన్నం ప్రభాకరా,… https://t.co/N5r4tXbfTc pic.twitter.com/uLNiscZGBf
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

