భారీ వర్షం..
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.
- విద్యుత్‌కు అంతరాయం
సిటీబ్యూరో, జూన్ 23 ( నమస్తే తెలంగాణ): నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. వర్షం ప్రారంభం కాగానే పెద్ద శబ్దం వచ్చిందని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని సాయి గార్డెన్ ప్రాంతంలో 11 కేవీ ఫీడర్ లైన్‌పై చెట్టు కూలడంతో విద్యుత్ స్తంభం పూర్తిగా ధ్వంసమైందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అమీర్‌పేటలోని స్వర్ణజయంతి ఫీడర్ పరిధిలో ఈఎస్ఐ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు స్పందించి సరఫరా పునరుద్ధరించారు.
బడంగ్‌పేట 11కేవీ ఫీడర్, లెనిన్ నగర్ సబ్‌స్టేషన్, 11కేవీ బేగంబజార్ ఫీడర్, 33/11 కేవీ ఉస్మానియా ఆస్పత్రి సబ్ స్టేషన్, 33/11కేవీ గ్రీన్‌ల్యాండ్ సబ్‌స్టేషన్, 11 కేవీ బండ్లగూడ జాగీర్, 33/11 కేవీ స్నేహిత హిల్స్ సబ్ స్టేషన్ల పరిధిలో వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిందని అధికారులు తెలిపారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 11కేవీ డాక్టర్ కాలనీలో ఫీడర్ కేబుల్ దెబ్బతిని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, అలాగే హబ్సిగూడ సర్కిల్లో 11కేవీ చెన్నారెడ్డి తోట ఫీడర్ పరిధిలో ఇన్సులేటర్ దెబ్బతింది. ఎమర్జెన్సీ బృందాలు యుద్ధ ప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అత్యధికంగా చార్మినార్.. డబీర్‌పురాలో 7.1 సెంటీ మీటర్లు, సర్దార్ మహల్లో 7.0 సెం.మీ, ఆసిఫ్‌నగర్ జియాగూడ రంగనాథ టెంపుల్, నాంపల్లి జుమ్మెరాత్ బజార్ ప్రాంతాల్లో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

