తాగి నడిపి మృతికి కారణమైనందుకు 10 ఏండ్ల జైలు

మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంటలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కనవేణి రాకేశ్ వర్మ విధులు ముగించుకుని యాక్టివాపై ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బోరబండ ప్రాంతానికి వీర రాఘవ చౌదరి మద్యం మత్తులో అతి వేగంగా బుల్లెట్‌పై వస్తూ.. సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకెళ్లాడు.. అదే సమయంలో రాకేశ్ వర్మను ఢీకొట్టాడు. దీంతో రాకేశ్వర్మకు తీవ్ర గాయాలు కాగా…చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను పూర్తిగా విశ్లేషించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాఘవచారి మద్యం మత్తులో ఉన్నాడని తేల్చారు. దీని కోసం ప్రమాదం జరిగిన స్థలం నుంచి అతను బయలుదేరిన ప్రాంతం వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. అతడిపై 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా సెక్షన్ 302 పార్ట్ -2 విధించారు. పోలీసులు పూర్తి సాంకేతిక ఆధారాలను సేకరించి రాఘవచారి మద్యం మత్తు కారణంగా రాకేశ్ వర్మ మృతి చెందాడని తేల్చారు. ఈ నెల 14న అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

