2 BHK Homes | ఈ డబుల్లో ఎట్లుండాలి ?.. సర్కారుపై డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఆగ్రహం
సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, లిఫ్ట్ లేక లబ్ధిదారులు ఇబ్బందులుపడుతున్నారు.
- కనీస సదుపాయాలు లేవంటూ..మండిపాటు
- ఇందిరాపార్కు వద్ద ధర్నా
2 BHK Homes | సిటీబ్యూరో/చిక్కడపల్లి, జూలై 14 (నమస్తే తెలంగాణ ) : సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, లిఫ్ట్ లేక లబ్ధిదారులు ఇబ్బందులుపడుతున్నారు. వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
గ్రేటర్ నలుమూలల నుంచి లబ్ధిదారులు భారీగా తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 65వేలకు పైగా లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా.. ఆ ఇండ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో లిఫ్టులు పనిచేయడం లేదని, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతున్నదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ఇండ్లలో సదుపాయాలు కల్పించాలి : ప్రొఫెసర్ నాగేశ్వర్
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వం నిర్మించిన 65వేల డబుల్ బెడ్రూం ఇండ్లలో సదుపాయాలు కల్పించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో డబుల్ బెడ్రూం ఇండ్లలో కరెంట్, మంచినీరు, రోడ్డు, లిఫ్ట్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కరెంట్, రోడ్డు, లిఫ్ట్ ఏర్పాటు చేయకపోవడంతో డబుల్ ఇండ్లలో పేదలు నివసించే పరిస్థితి లేదన్నారు.
మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 700 కోట్లు అవసరమని, వచ్చే బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలన్నారు. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ , సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసరావు, ఎం.దశరథ్, మహేందర్, డబుల్బెడ్రూం ఇండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వి.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

