Minister Srinivas Yadav | 50ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలో చేశాం : తలసాని
Minister Srinivas Yadav | దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి ఎదురొడ్డి పోరాడే సైనికుల్లో అత్యధికులు సిక్కులేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్‌పేటలోని అతిథి హోటల్లో శుక్రవారం అమీర్‌పేట సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా మిలన్ సమావేశం జరిగింది.
Minister Srinivas Yadav | దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి ఎదురొడ్డి పోరాడే సైనికుల్లో అత్యధికులు సిక్కులేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్‌పేటలోని అతిథి హోటల్లో శుక్రవారం అమీర్‌పేట సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా మిలన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సిక్కు సమాజ్ ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేసిన మంత్రి తలసాని యాదవ్‌కు మద్దతు తెలిపారు. తలసాని అంటేనే అభివృద్ధి అని.. సనత్‌నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి నిరూపించారంటూ ప్రశంసించారు.
ఈ ఎన్నికల్లో సిక్కు సమాజ్ మొత్తం తలసాని శ్రీనివాస్కేనంటూ ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో 50ఏళ్లలో జరగని అభివృద్ధిని పదేళ్లలో చేశామని వివరించారు. సీఎంగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి సైతం ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. ఆయన తర్వాత కొడుకు ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదన్నారు.
సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన వారు ఎవరైనా పార్టీలకు అతీతంగా అవసరమైన సాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గురుద్వార్ వద్ద పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులుపడుతున్నామని తన దృష్టి తీసుకొచ్చిన వెంటనే నాలాపై స్లాబ్ ఏర్పాటు చేసి పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. గ్రేవ్ యార్డ్ వివాదాన్ని పరిష్కరించి రూ.4.50కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. 20సంవత్సరాలుగా అత్తాపూర్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్న సిక్కులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇండ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు వివరించారు.
ఇక్కడి ప్రజల ఓట్లతో ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పని చేస్తున్న కిషన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో ఒక్కరోజైనా ప్రజల వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని.. తర్వాత అడ్రస్ ఉండదన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, గురుద్వార్ అధ్యక్షులు బాగిందర్ సింగ్, మాజీ మైనార్టీ కమిషన్ సభ్యులు సురేందర్ సింగ్, దర్శన్ సింగ్, అజ్జి సింగ్, నరేందర్ సింగ్, లాహోర్ సింగ్, టిల్లు సింగ్, ఆనంజిత్ కౌర్, గురుదీప్ సింగ్, సుమిత్ సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

