Development | అంచెలంచెలుగా అభివృద్ధి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట నియోజకవర్గంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్ల పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
గోల్నాక డివిజన్లోని పలు ప్రాంతాలలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో సీసీ, బీటీ రోడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లను కూడా నెలకొల్పడం జరుగుతుందని తెలిపారు. పురాతన డ్రైనేజీ వ్యవస్థను ఆదునీకరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అన్ని పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే చాలా పార్కుల్లో పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేశామని, పుట్‌పాత్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

