గాంధీ దవాఖానలో.. ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు బేష్
న్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు దవాఖానల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇందులో 11 రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ దవాఖానల ముఖ్య ప్రతినిధులు
- దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన దవాఖాన
- ఢిల్లీ జాతీయ సదస్సులో తెలంగాణ వైద్య శాఖకు ప్రశంసలు
- రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రత్యేక కమిటీ
బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 19 : ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్’ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపాటు దవాఖానల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇందులో 11 రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ దవాఖానల ముఖ్య ప్రతినిధులు పాల్గొనగా.. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు గాంధీలో మైక్రోబయాలజీ విభాగం రూపొందించిన ‘హస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్’ మాన్యువల్ పుస్తకం గురించి వివరించారు. కేరళ తరువాత ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలుచేస్తున్న గాంధీ దవాఖాన వైద్యులు జాతీయ సదస్సులో ప్రశంసలు అందుకున్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీలో నోడల్ అధికారిగా గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, సభ్యులుగా ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ నాగమణి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వినయ్ శేఖర్, ఆపరేషన్ థియేటర్స్ హెడ్ నర్సు సునీత, సెంట్రల్ స్టెరైల్ విభాగం స్టాఫ్ నర్సు జెస్సీ మోల్ ఉన్నారు.
దశల వారీగా సిబ్బందికి శిక్షణ
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలతో పాటు అన్ని జిల్లాల ప్రధాన దవాఖానలు, వైద్య కళాశాలలకు చెందిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ విభాగాల వద్ద పనిచేసే సిబ్బందికి ప్రపంచ, జాతీయ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ల నియమాలను అనుసరించి ఇన్ఫెక్షన్ల నియంత్రణ చర్యలు, హానికారక బ్యాక్టీరియా నివారణ కోసం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపై దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. పది దవాఖానలను ఎంపిక చేసి వంద మంది చొప్పున శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గాంధీలో ఆక్యుపెన్సీ పెరుగుతున్నది :
డాక్టర్ ఎం.రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి టి.హరీశ్‌రావు ప్రభుత్వ దవాఖానలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించడంతో దవాఖానలపై నమ్మకం పెరిగి రోగుల సంఖ్య పెరుగుతున్నది. గాంధీ దవాఖానలో వందకు 170 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. గాంధీలో కాన్పుల సంఖ్య, ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

