వ్యక్తిని బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగుల అరెస్టు
బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మే 27: బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించారు. నార్త్ లాలాగూడలోని జామియా మసీదు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ ఆసిఫ్ రెహ్మన్ (31) అలియాస్ టైగర్ ఆటోడ్రైవర్. తన ఇంటి సమీపంలో నివాసముండే తాడూరి కృష్ణతో అతడికి పాత గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు మనసులో పెట్టుకున్న టైగర్.. ఈ నెల 24న కృష్ణపై కత్తితో దాడి చేయగా, అతడి మెడపై గాయమైంది.
ఆ తర్వాత అక్కడి నుంచి టైగర్‌తో పాటు అతడి స్నేహితులైన సొహెల్ షేక్ చాంద్ (19), మరో బాలుడితో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ఈ క్రమంలో లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో మహ్మద్ అఫ్రోజ్‌కు కత్తి చూపిస్తూ బెదిరించి, అతడి నుంచి రూ. 70, సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. దీంతో బాధితుడు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ఫోల్డెడ్ కత్తి, ద్విచక్రవాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రమేశ్‌గౌడ్, ఎస్సైలు నాగరాజు యాదవ్, షాహీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

