దసరా షాపింగ్ బొనాంజా..
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా 9వ డ్రా బుధవారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడిగా సాగింది. ఈ లక్కీ డ్రా ఎంపిక చేసే కార్యక్రమంలో కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు షాపింగ్ చేసేందుకు వచ్చిన కస్టమర్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
- సందడిగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బహుమతుల పర్వం..
- ఉత్సాహంగా పాల్గొంటున్న వినియోగదారులు
- 9వ డ్రాలో ఐదురుగురు విజేతల ఎంపిక
- లక్కీ విన్నర్‌కు 20న బంపర్ బహుమతి
అమీర్‌పేట్, అక్టోబర్ 18: ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా 9వ డ్రా బుధవారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడిగా సాగింది. ఈ లక్కీ డ్రా ఎంపిక చేసే కార్యక్రమంలో కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు షాపింగ్ చేసేందుకు వచ్చిన కస్టమర్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కస్టమర్ల సమక్షంలో జరిగిన లక్కీ డ్రా విజేతల ఎంపికలో కేఎల్ఎం (సాయి సిల్క్స్ కళామందిర్ లి.) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలవాది మోహన్ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా వినాయక యాడ్స్ ఏజెన్సీ అధినేత బి.వినాయక్ రావులతో పాటు కేఎల్ఎం షాపింగ్ మాల్ అధికారులు పాల్గొన్నారు. ఈ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలను వారు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. అయితే, ఈ బొనాంజాకు సంబంధించి బంపర్ బహుమతిగా నిస్సాన్ మాగ్నెట్ కారును లక్కీ విన్నర్‌కు 20వ తేదీన బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగే ఈ వెంట్లో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ నెల 9న ప్రారంభమైన ఈ షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు లక్కీ డ్రా తీసే కార్యక్రమం కొనసాగుతోంది.
విజేతలు వీరే…
బుధవారం నాటి 9వ డ్రాలో విజేతలుగా నిలిచిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి. సీఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన పి.ఎన్.సంతోష్ కుమార్ మొదటి బహుమతిగా 32 ఇంచుల కలర్ టీవీని గెలుచుకున్నారు. 2వ బహుమతిని ఛర్మాస్లో షాపింగ్ చేసిన అదీబా, 3వ బహుమతిని కేఎల్ఎం షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన శ్రీనివాస్, 4వ బహుమతిని ఛర్మాస్లో కొనుగోలు చేసిన జేఎన్ రెడ్డి, 5వ బహుమతిని ఏబీఆర్ కేఫ్ నిలోఫర్‌లో షాపింగ్ చేసిన చైత్ర దక్కించుకున్నారు. ఈ నెల 20వ తేదీన నగరంలో జరిగే ఈవెంట్లో బంపర్ బహుమతిగా నిస్సాన్ మాగ్నెట్ కారును దక్కించుకునే విజేతను ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
కేఎల్ఎం షాపింగ్ మాల్ వేదికగా ఉంటుండటం ఆనందం
గత ఐదేండ్లుగా అమీర్‌పేట్ కేఎల్ఎం షాపింగ్ మాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న లక్కీ డ్రా విజేతల ఎంపికకు కేఎల్ఎం షాపింగ్ మాల్ వేదికగా ఉంటుండటం ఆనందంగా ఉంది. దసరా వస్తోందంటే చాలు.. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల లక్కీ డ్రాలకు సంబంధించిన అంశాలను కస్టమర్లు ఆసక్తిగా గమనిస్తుండటం చూస్తున్నాం. కేవలం తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసినవే కాకండా, తమ అదృష్టం కొద్దీ లక్కీ డ్రాలలో కూడా ఊహించని విధంగా బహుమతులు అందివస్తుండటం కస్టమర్లకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటోంది. కేఎల్ఎన్ షాపింగ్ మాల్లో అనేక ప్రోత్సాహకాలను కస్టమర్లకు అందిస్తున్నాం. 4 వేల కొనుగోళ్లపై 4 వేల గిఫ్ట్ వోచర్లను అందిస్తున్నాం. కేఎల్ఎం షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం అత్యాధునిక కలెక్షన్లు అందుబాటులో ఉంచాం.
– చలవాది మోహన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కేఎల్ఎం (సాయి సిల్క్స్ కళామందిర్ లి.)
ఆసక్తిగా ఎదురుచూస్తున్న కస్టమర్లు..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పదేండ్లుగా దసరా షాపింగ్ బొనాంజాను నిర్విరామంగా కొనసాగిస్తుండటం ఒక్క నమస్తే తెలంగాణ గ్రూప్‌నకే చెల్లింది. పాఠకుల ఆదరాభిమానాలతో దూసుకుపోతున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలను అనుసరించడం ద్వారా ఊహించని బహుమతులకు ఎంపికవుతున్న విజేతలకు దసరా ఉత్సాహం రెట్టింపవుతోంది. నమస్తే తెలంగాణ గ్రూప్ ఇదే తరహాలో భవిష్యత్తులో కస్టమర్లకు మేలు చేసే ఎటువంటి మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు రావాలి.
– బి.వినాయక్‌రావు, డైరెక్టర్ వినాయక యాడ్స్ ఏజెన్సీస్.
మొదటి బహుమతి లభించడం.. ఆనందంగా ఉంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో 9వ డ్రాలో మొదటి బహుమతి లభించడం ఆనందంగా ఉంది. దసరా షాపింగ్ చేస్తూనే లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవాలనుకంటున్న కస్టమర్లు ప్రతి రోజు నమస్తే తెలంగాణ దిన పత్రికలో నగరంలోని ఔట్లెట్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటుండటం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోంది. నగర వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా ఈ డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాకు ప్రతియేటా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాను ప్రతి సంవత్సరం తప్పకుండా అనుసరిస్తున్నాను.
– పి.ఎన్.సంతోష్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, కండ్లకోయ మేడ్చల్.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

