దసరా బొనాంజా..ముందుగానే పండుగ

కొండాపూర్, అక్టోబర్ 2: “దసరా పండుగ సందడి ముందుగానే వచ్చినట్టనిపిస్తుంది. షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్తుంటే.. బహుమతులు వస్తాయని, కూపన్ నింపమని నిర్వాహకులు చెబితే, ఏదోలే అనుకుని కూపన్ నింపితే.., మొదటి రోజునే లక్కీ డ్రాలో తన పేరు వస్తుందని, అందులోనూ ఎల్ఈడీ కలర్ టీవీ వస్తుందని అస్సలు ఊహించలేదన్నది” చింతల్‌కు చెందిన వెంకటలక్ష్మి. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో ప్రారంభమైన దసరా బొనాంజా ఉత్సవాలలో మొదటి రోజు శనివారం మాదాపూర్‌లోని సెలెక్ట్ మొబైల్ స్టోర్‌లో లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు.
డ్రాలో చింతల్‌కు చెందిన వెంకట లక్ష్మీ మొదటి బహుమతి, హుస్సేన్ రెండో బహుమతి, శివ శంకర్ మూడో బహుమతి, కే హోసన్న నాల్గవ బహుమతి, సత్యజిత్ రామ్ ఐదో బహుమతులను గెలుచుకున్నారు. సెలెక్ట్ మోబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మురళి రేతినేని విజేతలను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా దసరా బొనాంజా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వినియోగదారులకు ముందుగానే పండగ ప్రత్యేక ఆనందం పొందేలా చేస్తున్నామన్నారు.
అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ బొనాంజా కొనసాగుతుందన్నారు. ఫ్రీడమ్ హెల్త్ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్‌లు టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండగా, సెలెక్ట్ మోబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ప్రధాన సహకారాన్ని అందిస్తుండగా, నీలోఫర్ కేఫ్ పవర్డ్ బైగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్టోర్లలో కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారులకు కూపన్లను అందజేస్తున్నట్లు, ప్రతి రోజు ఐదుగురిని లక్కీ డ్రాలో విజేతలుగా, బంపర్ డ్రా ద్వారా అక్టోబర్ 11న విజేతను ప్రకటించనున్నట్లు తెలిపారు.
రోజు వారి బహుమతుల్లో మొదటి విజేతకు 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ, రెండో విజేతకు మొబైల్ ఫోన్, మూడు, నాల్గు, ఐదో విజేతలకు గిఫ్ట్ ఓచర్లను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు విజేతల వివరాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ దినపత్రికల అడ్వైర్టెజ్‌మెంట్ ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
దసరా పండుగ ముందుగానే వచ్చినట్లుంది
షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే.. దసరా బొనాంజా ఉంది కూపన్ నింపండి అంటే నమ్మలేదు. మొదటి రోజు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ దసరా బొనాంజాలో నాకు కలర్ టీవీ వచ్చిందని ఫోన్ వస్తే దసరా పండుగ ముందుగానే వచ్చిందనిపిస్తుంది. నాతో పాటు మా కుటుంబ సభ్యుల ఆనందానికి అంతులేదు. ఇలాంటి అవకాశం ఎవ్వరు వదులుకోవాలనుకోరని, ఇంకా ఎనిమిది రోజులు మిగిలి ఉన్నాయని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు షాపింగ్ చేసి బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నా. – వెంకట లక్ష్మి, చింతల్, మొదటి బహుమతి విజేత (32 ఇంచుల కలర్ టీవీ)
సెలెక్ట్ నమ్మకమైన మొబైల్ స్టోర్
మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుండటంతో అనేక పేర్లతో మొబైల్ స్టోర్లు వెలుస్తున్నాయి. వినియోగదారులకు నమ్మకంగా, నాణ్యమైన రకాల మొబైల్ ఫోన్ల ఉత్పత్తులను అందిస్తున్న సెలెక్ట్ స్టోర్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు సెలెక్ట్ స్టోర్లలోనే ఫోన్లను కొనేందుకు ఇష్టపడతాము. – స్నేహిత, వినియోగదారురాలు
వినియోగదారులకు ఉత్తమ సేవలు
వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు సెలెక్ట్ మొబైల్ స్టోర్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ప్రారంభిస్తాము. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దసరా బొనాంజాను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. లక్కీ డ్రా ద్వారా ప్రతి రోజు ఐదుగురు విజేతలకు బహుమతులను, బంపర్ డ్రాలో బహుమతిగా కారును అందజేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

