సంబురంగా.. దసరా బొనాంజా

- ఘనంగా బంపర్ డ్రాలు.. బహుమతుల వేడుకలు
- కన్నుల పండువగా సీఎంఆర్‌లో లక్కీ డ్రా
- తొమ్మిదో లక్కీ డ్రాలో విజేతలను ప్రకటించిన ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఏడీవీటీ ఏజీఎంలు
- నేడు ఫైనల్ విజేతల ప్రకటన
సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, అక్టోబర్ 10: పండుగ వేళల్లో వినియోగదారులకు ముందుస్తు వేడుకను అందించే దిశగా ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దిన పత్రికల సంయుక్తంగా అడుగులు వేస్తూ కొన్ని రోజులుగా నగర వినియోగదారుల ముంగిళ్లకు సంబరాలను తీసుకొచ్చింది. ఈ అత్యుత్తమమైన వేడుక అప్పుడే ఓ కొలిక్కి వచ్చింది. కాగా, దసరా పండుగకు ముందే సీఎంఆర్ షాపింగ్ మాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సీఎంఆర్ షాపిం గ్ మాల్లో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దసరా షాపింగ్ బొనాంజా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తొమ్మిదో లక్కీ డ్రా తీశారు. ప్యాట్నీలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినియోగదారుల సమక్షంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఏడీవీటీ ఏజీఎంలు పి.రాము లు, ఎం.రాజిరెడ్డి, సీఎంఆర్ షాపింగ్ మాల్ గోల్డ్ సెక్షన్ స్టోర్స్ మేనేజర్ బి.అనిల్ చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు.
లక్కీ డ్రా లో భాగంగా భాగ్యలక్ష్మికి 32 ఇంచుల ఎల్ఈడీ కలర్ టీవీ బహుమతిగా లభించింది. రెండో బహుమతి శ్యాం సుందర్ రెడ్డి కి, మూడోది కావ్య, నాలుగోది మహమూద్ పాషా, ఐదో బహుమతులను రాహుల్‌లు గెలుచుకున్నట్లు ఏజీఎంలు రాములు, రాజిరెడ్డిలు ప్రకటించారు. దసరా ఉత్సవాలను ప్రజలు మరిం త సంతోషంగా జరుకునేలా ‘దసరా షాపింగ్ బొనాంజా’ పేరు తో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’లు, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్‌లు టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ వేడుకల్లో సెలెక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్సే మెయిన్ స్పాన్సర్లు గానూ, నిలోఫర్ కేఫ్ పవర్డ్బైగా వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఎంపిక చేసిన ‘సీఎంఆర్’ షాపింగ్ మాల్ లో కొనుగులు చేసిన ప్రతి ఒక్కరికి కూపన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు.
పదేళ్ల నుంచి బంపర్ డ్రా తీస్తున్నాం..
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో బంపర్ డ్రాను పదేళ్లుగా తీస్తున్నాం. ఇం దులో భాగంగా ఈ సారి తొమ్మిదో డ్రా విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరం. మొదటి బహుమతిగా 32 ఇంచుల కలర్ టీవీ, రెండో బహుమతిగా మొబైల్ ఫోన్, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాలుగు, ఐదో బహుమతులు గా గిఫ్ట్ హ్యాంపర్లు అందించాం. దసరా మహోత్సవం నేపథ్యంలో బంపర్ డ్రా నేడు ఉంటుంది. ఫైనల్ విజేతలను ప్రకటిస్తాం. దానికి ఒక్క రోజు మాత్రమే ఉండటంతో వినియోగదారులంతా షాపింగ్ చేసి కూపన్లు పొందొచ్చు. – పి.రాములు, ఏజీఎం, ఏడీవీటీ, నమస్తే తెలంగాణ దినపత్రిక
బొనాంజాలో భాగస్వాములవడం ఆనందంగా ఉంది..
అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ దుస్తులతో పాటు కిడ్స్‌వేర్, మెన్స్‌వేర్, రెడీమేడ్స్, పార్టీవేర్లలో నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉంచాము. ప్రత్యేకంగా మహిళల కోసం అన్ని రకాల పట్టు చీరెలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక బంగారం కొనుగోలుదారుల కోసం పూర్తిగా 916 సర్టిఫైడ్, హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే అందుబాటులో ఉంచాం. నగరంలోని ఏ షాపింగ్ మాల్లో లభించని వైరైటీ ఆభరణాలు మా వద్ద లభిస్తాయి. పదేళ్ల నుంచి నమస్తే తెలంగాణ దిన పత్రికతో ఈ దసరా షాపింగ్ బొనాంజాలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. – సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ , సీఎంఆర్ షాపింగ్ మాల్
ఐదేళ్లుగా షాపింగ్ ఇక్కడే..
పండుగలకే కాకుండా మేమెప్పుడూ కటుంబ సమేతంగా షాపింగ్ చేయాల్సి వచ్చినా సీఎంఆర్ షాపింగ్ మాల్లోనే చేస్తాం. ఇక్కడ నాణ్యమైన దుస్తులే కాకుండా ధరలు అందుబాటులో ఉంటాయి. మాకు సీఎంఆర్ షాపింగ్ మాల్తో ఐదేళ్ల అనుబంధం ఉంది. వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల దుస్తులు ఇక్కడ లభ్యమవుతాయి. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ దిన పత్రికల యజమాన్యం దసరా బొనాంజా నిర్వహించి ఇలా బహుమతులను ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. – మాదారపు రజిత, వినియోగదారురాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

