పర్యావరణ పరిరక్షణకు సందేశాలివ్వడం మానేసి ఆచరణ చేపట్టాలని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ,సీడ్ కాప్టర్ సంస్థల ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద 1.5 లక్షల సీడ్ బాల్స్‌ను డ్రోన్స్ సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. డ్రోన్లలో స్వయంగా సీడ్‌బాల్స్‌ను నింపి ఆపరేట్ చేస్తూ వెదజల్లారు. సీతాఫలం, ఉసిరి, చింత, వెదురు, రావి విత్తనాలు చల్లినట్లు చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్ తెలిపారు. మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్‌కుమార్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.