పోలీసుల సమస్యలకూ గ్రీవెన్స్ సెల్

సిటీబ్యూరో, సెప్టెంబరు 9(నమస్తే తెలంగాణ):పోలీసు కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేస్తానని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హామీ ఇచ్చారు. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీసు కమిషనరేట్ స్పెషల్ బ్రాంచి, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సీసీఆర్బీ, షీ టీమ్స్ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనదీ పోలీసు కుటుంబమేనని, తనకు పోలీసుల సమస్యలేంటో పూర్తిగా తెలుసన్నారు. పోలీసులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, వారి పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని సూచించారు. ఈ సమావేశంలో మొత్తం 200 మంది సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

