32 మందిని కాపాడారు..

సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(సీఏహెచ్టీయూ) అమాయకులను కాపాడేందుకు పకడ్బందీగా పని చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మందిని కాపాడటం తో పాటు 76 మంది నిందితులను అరెస్ట్ చేసింది. మొత్తం 14 కేసులను నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టి.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏడుగురు, మహారాష్ట్ర-7, తెలంగాణ-4, ఏపీ-3, కర్నాటక-7, న్యూఢిల్లీకి చెందిన నలుగురిని కాపాడి.. వారిని పునరావాస కేంద్రాలకు, వారి సొంత ఊళ్లకు పంపించారు. ఆపరేషన్ స్మైల్-7లో భాగంగా భిక్షాటన, చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, బాలకార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి.. వారిని వారివారి ఊర్లకు పం పించారు. ఇదిలా ఉండగా.. మియాపూర్‌లోని ఓ హోంకు చెందిన బాలికపై హూస్సేని ఆలం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న సీఏహెచ్టీయూ పూర్తి వివరాలు సేకరించి.. ఆ బాలికను గుర్తించి.. కర్నూల్లో ఉన్న వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బాలికపై మిస్సింగ్ కేసు 2005లో నమోదయ్యింది.
గుర్తించి.. అప్పగించారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ బాలిక, బాలుడు అదృశ్యమైన కేసును సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు అప్పగించారు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు , ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన బాలికకు షేర్ చాట్, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఆమెను మీరట్ నుంచి రాజస్థాన్ తీసుకువచ్చాడు. ఈ ఘటనపై గంగానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అయితే వారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటున్నారని తెలిసింది. దీంతో వారి ఆచూకీని గుర్తించే బాధ్యతను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు అప్పగించారు. రంగంలోకి దిగిన ఏహెచ్‌టీయూ విభాగం అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని గుర్తించి ఉత్తర్‌ప్రదేశ్ గంగానగర్ పోలీసులకు అప్పగించారు. వీరిని గుర్తించే ప్రక్రియలో బాలుడు 30 ఐఎంఈ నంబర్లు, 9 ఫోన్ నంబర్లను ఉపయోగించాడని తేలింది. ఈ విచారణలో బాలుడిపై గతంలో రాజస్థాన్ లో బైక్ దొంగతనం కేసు ఉందని తేలింది. ఇలా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మనుషుల అక్రమ రవాణాపై చాలా కఠినంగా ఉంటూ.. బాధితుల ఆచూకీతో పాటు నిందితుల స్థావరాలను గుర్తిస్తుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

