డాక్టర్ ఫోన్ నంబర్‌తో ఇన్స్టాగ్రామ్ ఖాతా
ఫోన్‌కాల్స్, సందేశాలతో ఉక్కిరిబిక్కిరైన వైద్యుడు
సిటీబ్యూరో, జూన్2(నమస్తే తెలంగాణ): హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు చివరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
బండ్లగూడకు చెందిన వైద్యుడికి కొన్ని వందలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. గంజాయి కావాలని, గ్రాము ధర ఎంత…అని అడుగుతున్నారు. దీంతో కంగారు పడిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టారు.