ప్రతిభ ఉన్న ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు..

సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి ప్రైడ్-డే వేడుకలను నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రతిభ ఉన్న ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు వచ్చేలా చేసి.. వారికి అపాయింట్మెంట్ లేఖలను అందించారు. ఈ సందర్భంగా వివిధ వృత్తి, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరుగురిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. అనంతరం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రైడ్ డేను పురస్కరించుకుని బెలూన్లను ఎగుర వేశారు. ఈ సందర్భంగా హెల్ప్‌డెస్క్‌ను నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, వీరి ప్రతిభను గుర్తించి సహకరిస్తున్న సంస్థలను సీపీ సజ్జనార్ అభినందించారు. తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసులు ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమానికి అండగా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలని సీపీ కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

