తాగి నడిపారు.. శిక్ష పడింది..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురికి న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా
మలక్‌పేట, జూన్ 16: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురికి న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న తెలిపారు.
హయత్‌నగర్‌కు చెందిన డీసీఎం డ్రైవర్ ఆళ్ల ఆదినారాయణరెడ్డికి రూ. 2100 జరిమానా, ఏడు రోజుల సాధారణ జైలు, మూసారాంబాగ్‌కు చెందిన బోనాలు వెంకటేశ్‌కు రూ. 2100 ఫైన్, మూడురోజుల సాధారణ జైలు, కొత్తపేట మారుతీనగర్‌కు చెందిన బింగి రవితేజగౌడ్కు రూ. 2100తో పాటు పదిరోజుల సాధారణ జైలు శిక్ష, సైదాబాద్‌కు చెందిన వీరవెంకటేశ్కు రూ.2100 జరిమానా, ఆరు రోజుల జైలు, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పత్తెపు విశాల్‌కు రూ.2100 ఫైన్, ఐదురోజుల జైలు, అంబర్‌పేట అలీకేఫ్ ప్రాంతానికి చెందిన బి.వేణుకు రూ.2100 జరిమానా, ఏడురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జ్యోత్స్న తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- court
- drunk and drive
- penalise
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

