అందుబాటులోకి మరిన్ని లింకు రోడ్లు
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రహదారులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి తేగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
- ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా రోడ్ల నిర్మాణం
- ల్యాంకో హిల్స్ నుంచి ఓఆర్ఆర్ వరకు మరిన్ని లింకులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రహదారులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి తేగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఆయా ప్రాంతాల్లోని జన సాంద్రత ను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలను రూపొందించి ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతోంది. ట్రాఫిక్‌లో సమయం ఆదా కావడంతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించడం, చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పని లేకుండా వేగం గా, సాఫీగా, గమ్య స్థానాలను చేరుకునేలా కొత్తగా లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా మణికొండ ల్యాంకోహిల్స్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు విశాలమైన లింకు రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రహదారులను తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్‌నగర్ నుంచి వట్టి నాగులపల్లి మీదుగా ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి
గ్రేటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుతో రోడ్ల అనుసంధానం అత్యం త కీలకంగా పరిగణించి పట్టణాభివృద్ధి శాఖ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంపై పురోగతిపై ఇటీవల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పంచుకున్నారు.
ట్రాఫిక్ లేకుండా.. సాఫీగా ప్రయాణం
నగర నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం లక్షలాది మంది ఐటీ కారిడార్ వైపే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వారి సం ఖ్య గణనీయంగా ఉంటోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాయదుర్గం, మణికొండ ప్రాంతాల మీదు గా ఒక కొత్త లింకు రోడ్డును చేపట్టింది. మణికొండలోని ల్యాంక్ హిల్స్ నుంచి దానికి ఎదురుగా ఉన్న కొండలతో ఉన్న ప్రాంతమైన ఖాజాగూడ మీదుగా నానక్‌రాంగూడ, నార్సింగిల మధ్య ఉన్న ఓఆర్ఆర్ను కలుపుతూ విశాలమైన లింకు రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ లింకు రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే రాయదుర్గం మల్కంచెరువు పక్క నుంచే నేరుగా ఓఆర్ఆర్ వెళ్లేందుకు ఇదొక కీలకమైన లింకు రోడ్డుగా మా రుతుంది. దీంతో ప్రస్తుతం, రాయదుర్గం చౌరస్తా, ఖా జాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బయోడైవర్సిటీ, నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ల్లో గణనీయంగా ట్రాఫిక్ జామ్ నుంచి ఊరట కలుగుతుంది. ఇక తెల్లాపూర్‌ను ఆనుకొని ఉస్మాన్‌నగర్ నుంచి ప్రస్తుతం కొల్లూ రు, తెల్లాపూర్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వైపు రోడ్డు మార్గా లు ఉండగా, వట్టి నాగులపల్లి మీదుగా కోకాపేట వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఉస్మాన్‌నగర్ నుంచి నేరుగా కోకాపేట వైపున్న ఓఆర్ఆర్కు చేరుకులానే విశాలమైన లింకు నిర్మాణం పనులను హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిం ది. ఇలా ఐటీ కారిడార్లోనే అత్యంత కీలకమైన లింకు రోడ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని కోర్ సిటీపై దృష్టి సారిస్తూనే శివారు ప్రాంతాల్లో కొత్తగా లింకు రోడ్ల అభివృద్ధి శ్రీకారం చు ట్టారు. ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తే ప్రధాన రహదారుల వెంబడే కాకుండా కొత్తగా అభివృద్ధి చేసిన లింకు రోడ్ల వెంబడి, అంతర్గత రహదారుల పొడవునా భూముల ధరలు పెరగడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు అంచ నా వేస్తున్నారు. ప్రస్తుతం కోర్ సిటీలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే 50 ఏళ్ల వరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా రోడ్ నెట్ వర్క్‌ను శివారుల్లో కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా నగరవాసు లు సాఫీగా గమ్య స్థానాలను చేరుకునేలా లింకు రోడ్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు అభివృద్ధి చేస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

