హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): క్యాసినో ఆడిస్తూ మనీలాండరింగ్, హవాలా విధానాల్లో భారీ మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించారనే అభియోగాలను ఎదురొంటున్న చీకోటి ప్రవీణ్‌కు భద్రత కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
అంతకుముందు ఇరు పక్షాల వాదనలు ఉన్న హైకోర్టు.. ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరుతూ చీకోటి ప్రవీణ్ చేసుకున్న దరఖాస్తుపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 655 ప్రకారం దరఖాస్తును పరిషరించాలని న్యాయమూర్తి జస్టిస్ కే లలిత గురువారం ఆదేశాలు జారీచేశారు.