ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులు
యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
- పుట్టా రాము హత్య కేసు నిందితురాలిపై ఫిర్యాదు
బంజారాహిల్స్, ఫిబ్రవరి 16: యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన బత్తిన దర్మారెడ్డి 2021లో ఎల్‌ఎన్‌నగర్‌లో 60 గజాల ఇంటిని మహేశ్వర్ రెడ్డి వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఆ ఇంటిలో హిమాంబీ కుటుంబం అద్దెకు ఉంది. ఇంటిని ఖాళీ చేయడానికి రెండు నెలల సమయం ఇవ్వాలని, అప్పటి వరకు అద్దె చెల్లిస్తామని దర్మారెడ్డిని కోరారు.
మూడు నెలలు గడిచినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పాటు అడిగేందుకు వెళ్లిన ధర్మారెడ్డిని, మహేశ్వర్‌రెడ్డిని బెదిరించారు. దీంతో ధర్మారెడ్డి కోర్టును ఆశ్రయించగా.. ఇంటిని ఖాళీ చేయాలని తీర్పు వచ్చింది. కోర్టు సిబ్బందితో కలిసి ధర్మారెడ్డి ఇంటి వద్దకు వెళ్లగా.. హిమాంబీ తదితరులు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు. ఆ ఇంట్లో హిమాంబీ వ్యభిచార గృహం, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పుట్టా రామును కూడా దారుణంగా హత్య చేయించారని తెలుసుకున్న ఇంటి యజమాని ధర్మారెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

