కారుణ్య దందా!
ఉస్మానియా ఆస్పత్రి కేంద్రంగా జోరుగా కారుణ్య నియామకాల దందా సాగుతున్నది. తమ వారసులను ఉద్యోగంలో చేర్పించేందుకు కొందరు ఉద్యోగులు తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్' సర్టిఫికెట్లను కొనుగోలు చేసి..అక్రమంగా కారుణ్య నియామకాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా అనార్యోంతో బాధపడుతూ విధులు నిర్వర్తించేలేని స్థితిలో ఉంటే వారి వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు.
-
ఉస్మానియా కేంద్రంగా తప్పుడు సర్టిఫికెట్లతో అక్రమ నియామకాలు
-
యథేచ్ఛగా ఫేక్ ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’
-
చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
-
చెల్లని సర్టిఫికెట్తో పదోన్నతి పొంది.. చక్రం తిప్పుతున్న మెడికల్ రికార్డ్ అధికారి
-
అవినీతి మత్తులో చోద్యం చూస్తున్న అధికారులు
ఉస్మానియా ఆస్పత్రి కేంద్రంగా జోరుగా కారుణ్య నియామకాల దందా సాగుతున్నది. తమ వారసులను ఉద్యోగంలో చేర్పించేందుకు కొందరు ఉద్యోగులు తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లను కొనుగోలు చేసి..అక్రమంగా కారుణ్య నియామకాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా అనార్యోంతో బాధపడుతూ విధులు నిర్వర్తించేలేని స్థితిలో ఉంటే వారి వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్, పక్షవాతం, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు తదితర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఉద్యోగం చేయలేని స్థితికి చేరుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది ఉద్యోగులు తప్పుడు సర్టిఫికెట్లతో తమ వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అటు ఫించన్ తీసుకుంటూ..ఇటు అతడి వారసుడు ఉద్యోగం పొంది, జీతం తీసుకుంటుండటంతో ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా అర్హులైన వారికి పదోన్నతులు అందడం లేదని, అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రావడం లేదని పలువురు వాపోతున్నారు.
మిగతాకారుణ్య నియామకం పొందడానికి కావాల్సిన ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్ కావాలంటే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆరోగ్యపరంగా ఉద్యోగి విధులు నిర్వర్తించే స్తోమత ఉన్నప్పటికీ డబ్బులు ముట్టచెబితే చాలు..‘ఆరోగ్య పరంగా ఈ ఉద్యోగి విధులు నిర్వర్తించడానికి అర్హుడు కాడు’ అంటూ.. ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్ చేతిలోకి వస్తున్నదన్న రోపణలున్నాయి.
వైద్య రిపోర్టులను తారుమారు చేసి..
మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్ కావాలంటే సదరు ఉద్యోగికి వైద్యుల సూచన మేరకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ జరిగితే.. వాటి ఆధారంగా ఆ ఉద్యోగికి మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్తో సదరు ఉద్యోగి ‘అనారోగ్య రీత్యా తాను విధులు నిర్వర్తించలేనందున తన వారసుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఉద్యోగి వారసుడికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకుని మెడికల్ రికార్డు విభాగానికి చెందిన కొందరు ఉద్యోగులు వైద్య పరీక్షల నివేదికలను తారుమారు చేసి అంటే.. మెడికల్ రిపార్టులు సాధారణంగానే ఉన్నా, అసాధారణంగా ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్‌లను తారుమారి చేసి, వాటి ఆధారంగా సదరు ఉద్యోగి విధులు నిర్వర్తించడానికి ఆరోగ్యం సహకరించదంటూ.. ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్‌ను జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నకిలీ సర్టిఫికెట్తో పదోన్నతి
తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లను సృష్టించడలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ తన పదోన్నతిని కూడా నకిలీ సర్టిఫికెట్తో పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీహెచ్ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేతులు తడిపి, చెల్లని సర్టిఫికెట్తో మెడికల్ రికార్డు క్లర్క్ నుంచి మెడికల్ రికార్డు టెక్నీషియన్‌గా పదోన్నతి పొందడమే కాకుండా అర్హులైన వారు, ఉన్నప్పటికీ ఇన్చార్జ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్‌గా కూడా చలామణి అవుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారుణ్య నియామం కింద, 1995లో ఫైర్‌మెన్‌గా ఉస్మానియా దవాఖానలో చేరిన ఉద్యోగి 2000లో బ్రాడ్మా మిషన్ ఆపరేటర్(బీపీఎంవో)గాను, ఆ తరువాత 2004లో మెడికల్ రికార్డ్ క్లర్క్(ఎంఆర్సీ)గాను పదోన్నతి పొందిన సదరు ఉద్యోగి 2012లో మెడికల్ రికార్డ్ టెక్నీషియన్‌గా(ఎంఆర్టీ)గా పదోన్నతి పొందినట్లు వైద్యశాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎంఆర్టీగా పదోన్నతి పొందాలంటే అందుకు విద్యార్హత ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. కానీ సదరు ఎంఆర్టీ కేవలం 10వ తరగతి మాత్రమే పూర్తిచేసినట్లు అతడి సర్వీస్ రికార్డు స్పష్టం చేస్తోంది. 10వ తరగతి విద్యార్హతతో ఫైర్‌మెన్‌గా ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి ఎలాంటి చదువులు చదవకున్నా, పరీక్షలు రాయకున్నా ఇంటర్మీడియట్‌కు సమానమైనట్లు పేర్కొంటున్న ఆలిమ్/ఫాజిల్ ధ్రువపత్రం సమర్పించడం గమనార్హం.
పరీక్షలు రాయకుండానే సర్టిఫికెట్ ఎలా….?
ఆలిమ్/ఫాజిల్ అనేది ఉర్దూలో పండిట్ కోర్సు. పంజాగుట్టలోని ఉర్దూ విదార సంస్థలో ఇలాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇలాంటి కోర్సులు చేయడానికి గతంలో ఉర్దూ మీడియం చదివి ఉండాలి. కానీ సదరు ఎంఆర్టీ ఉద్యోగి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే చదివి, హఠాత్తుగా ఉర్దూలో పండిత్ కోర్సు ఎలా పూర్తిచేశాడో ఆ సర్టిఫికెట్ జారీచేసిన ఉర్దూ విదార అధికారులకే తెలియాలి. ఒక వేళ ఈ కోర్సును చదివినట్లు భావించినా, సదరు ఉద్యోగి ఎక్కడ కూడా కోర్సు చేయడానికి అనుమతి తీసుకున్నట్లుగాని, కనీసం పరీక్షలు రాసేటప్పుడైనా సెలవు పెట్టన దాఖలాలు లేవు. ఉర్దూ విదార పరీక్షలు ఎప్పుడు, ఎలా రాశాడో అతడికే తెలియాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఏవైనా పై చదువులు చదవాలన్నా లేక పరీక్షలు రాయాలన్నా తప్పనిసరిగా పనిచేసే శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.
చెల్లని సర్టిఫికెట్తో పదోన్నతి ఎలా..
ఉర్దూ విదార ద్వారా పూర్తి చేసిన ఆలిమ్/ఫాజిల్ అనే కోర్సు ఇంటర్మీడియట్‌కు సరిసమానం కాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆ కోర్సును ఇంటర్మీడియట్‌తో సమానంగా పరిగణించడం లేదు. అలాంటిది సదరు ఉద్యోగి విషయంలో 2012 నాటి డీహెచ్ కార్యాలయం అధికారులు అతడికి ముడుపుల ఒప్పందం ప్రకారం చెల్లని సర్టిఫికెట్‌పైనే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(ఎంఆర్టీ) పదోన్నతిని కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్వీస్ రికార్డులో..
సదరు ఎంఆర్టీ ఉద్యోగికి సంబంధించిన సర్వీసు రికార్డులో మాత్రం అతడి విద్యార్హతలను అప్డేట్ చేయకపోవడం విడ్డూరం. ఉర్దూ విదార నుంచి ఆలిమ్/ఫాజిల్ కోర్సు పూర్తిచేసినట్లు నకిలీ సర్టిఫికెట్‌ను చూపించి 2012లో పదోన్నతి పొందిన ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ రికార్డులో ఇప్పటి వరకు అతడి విద్యార్హత 10వ తరగతిగానే ఉండటం, ఇంటర్ లేదా దానికి సమానమైన విద్యనభ్యసించినట్లు ఎక్కడా కూడా ఎస్‌ఆర్‌లో లేకపోవడం మరో విచిత్రం. అంటే అతడి సర్వీస్ రికార్డ్ ప్రకారం ఎంఆర్టీ పదవికి అర్హుడు కాదని స్పష్టమవుతోంది.
వీఆర్ఎస్ ఉపసంహరణ…
2025 మార్చిలో కరీంనగర్‌లోని ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి ప్రాథమిక పశు వైద్యశాలలో లైవ్‌స్టాక్ అధికారిగా పనిచేస్తున్న జడ కొమురయ్య, తాను కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు నకిలీ మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్ కొనుగోలు చేసి, తన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు యత్నించాడు. ఈ సర్టిఫికెట్ నకిలీదని తెలుసుకున్న సదరు పశువైద్యశాఖ అధికారి.. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొమురయ్యతో పాటు నకిలీ సర్టిఫికెట్‌ను సృష్టించిన మరో 8 మందిని అరెస్టు చేశారు. ఈ ఉదంతంతో ఉస్మానియా ఎంఆర్టీ ఉద్యోగి 2025 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చేలా స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తరువాత నకిలీ సర్టిఫికెట్ల కేసు సద్దుమణగడంతో సదరు ఎంఆర్టీ 2025 మేలో తన వీఆర్ఎస్ దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుమారు 35 మంది నుంచి..
సదరు ఎంఆర్టీ అధికారి కారుణ్య నియామకాల కోసం ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35మంది ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఉదంతంతో వెనక్కి తగ్గిన సదరు అధికారి డబ్బులు తీసుకున్న వారికి ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వకపోగా, వారికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని సమాచారం. దీంతో బాధిత ఉద్యోగులు డబ్బులు ఇచ్చిన విషయం బయటకు చెప్పుకోలేక, అధికారిని నిలదీయ లేక ఉన్న సొమ్మును పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోగా, వారిలో కొంత మంది మాత్రం వివిధ మార్గాల ద్వారా సదరు ఉస్మానియా మెడికల్ రికార్డు టెక్నీషియన్‌పై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు అధికారికి ఉన్న పలుకుబడి, కొందరు సంబంధిత ఉన్నతాధికారులకు అందించే ముడుపుల ముందు బాధితులు ఇచ్చే ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.
సదరు అధికారిపై ఇప్పటికే ఓ న్యాయవాదితో పాటు పలువురు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా కారుణ్య నియామకాలు పొందుతున్న వారితో పాటు నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న కేటుగాళ్లు, చెల్లని సర్టిఫికెట్తో అక్రమ పదోన్నతి పొందిన వారిపై చట్టపరమైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉస్మానియా కేంద్రంగా..
ఉస్మానియా దవాఖానలో మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(ఎంఆర్టీ), ఇన్చార్జ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్(ఎంఆర్వో)గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి యథేచ్ఛగా తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లు సృష్టిస్తూ, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నా యి. సాధారణంగా ఎవరైనా అనారోగ్యం కారణంగా విధులు నిర్వర్తించే పరిస్థితిలో లేకపోతే వారికి ఉస్మానియా, గాంధీ దవాఖానలోని మెడికల్ బోర్డులు ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్లను జారీ చేస్తాయి. ఇందుకోసం మెడికల్ బోర్డు సదరు ఉద్యోగికి అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలను నిర్వహించి, వాటి నివేదికల ఆధారంగా సర్టిఫికెట్లను జారీ చేస్తారు. మెడికల్ బోర్డులోని కొందరు అవినీతి అధికారుల సహకారంతో ఉస్మానియాకు చెందిన ఎంఆర్టీ, ప్రస్తుత ఇన్చార్జ్ ఎంఆర్వో మెడికల్ రిపోర్టులను తారుమారు చేసి, తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలకు సంబంధించిన నకిలీ మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్ల కేసుల్లో సదరు ఎంఆర్టీ హస్తం ఉండవచ్చనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపితే నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ కారుణ్య నియామకాల దందాలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదని ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. సదరు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(ఎంఆర్టీ)పై కొంత కాలంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నకిలీ మెడికల్ ఇన్వాల్యుయేషన్ సర్టిఫికెట్ల తయారీతో పాటు అక్రమ కారుణ్య నియామకాల్లో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

