విశ్వనగరానికి మెట్రో2.0 శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది.
- ఎయిర్‌పోర్టు మెట్రోకు నేడే అంకురార్పణ
- శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
- ఆకాశమే హద్దుగా.. గ్రేటర్లో ప్రజారవాణా మరింత అభివృద్ధి
- రూపురేఖలను మార్చేసిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు
- భవిష్యత్తులోనూ మరిన్ని మార్గాల్లో విస్తరణ
ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది. నలుదిశలా నగరం విస్తరిస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగానే మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ చిక్కులు తప్పించేలా.. బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నది. ఆరేండ్లలోనే 33 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు వస్తే.. అందులో 17 ఫ్లైఓవర్లు ఉండటం విశేషం. సీఆర్ఎంపీ, లింకు రోడ్లు సైతం ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్డీపీ రెండో దశను రూ.3500 కోట్లతో చేట్టనున్నారు. ఇక ఎన్నో ప్రత్యేకతలను కలబోసుకున్న మెట్రో రైలు నగర రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలందిస్తూ.. రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతున్నది. 69.2 కి.మీ మేర నిర్మించిన మన మెట్రో ఎంతో ప్రత్యేకమైనది. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మార్గంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే నగరంలో మరిన్ని మార్గాల్లో మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది రాష్ట్ర సర్కారు. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్టు మెట్రో (రాయదుర్గం- శంషాబాద్ విమానాశ్రయం)కు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రస్తుతం 3 మెట్రో కారిడార్లలో రోజుకు 4లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు రూట్ కూడా అందుబాటులోకి వస్తే మరింత మందికి వెసులుబాటు కలుగనున్నది.
పెరుగుతున్న పట్టణీకరణతో ప్రజారవాణా వ్యవస్థలో మెట్రోకు ప్రాధాన్యత పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలతో వెలువడే కాలుష్యం పట్టణాల్లో అనేక సమస్యలకు దారితీస్తోంది. దానికి పరిష్కారమార్గంగా దేశ వ్యాప్తంగా ఉన్న 8మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 18 నగరాల్లో 22 మెట్రో ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉండగా, 12 నగరాల్లో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్ల సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అందులో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రత్యేకమైనది. ఢిల్లీ మెట్రో 351 కి.మీ మేర రైళ్లు పరుగులు పెడుతుంటే, 3 కారిడార్లలో హైదరాబాద్ మెట్రో 69.2 కి.మీ మేర అందుబాటులో ఉండి దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో మార్గంగా రికార్డుల కెక్కింది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
సుఖవంతమైన ప్రయాణం
- మియాపూర్ – ఎల్బీనగర్ కారిడార్‌లోని 29 కిలోమీటర్లు బస్సులో వెళ్తే గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. కారులో అయితే గంటన్నరకు పైగా పడుతుంది. అదే మెట్రోలో అయితే కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.
- జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ వరకు 10 కిలో మీటర్ల దూరానికి వెళ్లాలంటే బస్సులో గంట, కారులో 35 నిమిషాలు పడుతుంది. మెట్రోలో అయితే 20 నిమిషాల్లోనే వెళ్లొచ్చు.
- నాగోలు – రాయదుర్గం కారిడార్‌లోని 28 కిలోమీటర్ల మార్గంలో బస్సులో అయితే కనీసం గంటన్నర, కారులో గంటకుపైగా పడుతుంది. మెట్రోలో కేవలం 39 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
- మైండ్‌స్పేస్ – ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 31 కిలోమీటర్ల మార్గంలో కారులో అయితే కనీసం ముప్పావుగంట పడుతుంది. మెట్రోలో అయితే 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
రెండో విడుత మెట్రో ఇలా..
రెండో దశ మెట్రో కింద రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 32 కి.మీ కొత్తగా మెట్రోపనులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలిమీదుగా టోలిచౌకీ,మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు 26 కి.మీ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కి.మీ దూరం కలిపి మొత్తం మరో 62 కి.మీ మేర విస్తరించేందుకు డీపీఆర్‌లను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవే మార్గాలు కాకుండా భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కి.మీ మేర మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనలను హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఉమ్టా) రూపొందించింది.
2041సంవత్సరానికిగానూ అంచనా(ఉమ్టా నివేదిక ఆధారంగా)
- మెట్రో 204 కిలోమీటర్లు
- ఎల్ఆర్టీఎస్/మెట్రో లైట్ – 137 కిలోమీటర్లు
- ఎంఎంటీఎస్ 264 కి.మీలు
- ప్రత్యేకంగా బస్సు లేన్/ బీఆర్టీఎస్
- ట్రామ్వే 362 కి.మీలు
- రోడ్ నెట్వర్క్ 1900 కిలోమీటర్లుఎన్ఎంటీ నెట్వర్క్ 450 కి.మీ
- ఎలక్ట్రిక్ మొబిలిటికి అత్యంత ప్రాధాన్యత
ఎయిర్ పోర్టు మెట్రోలో విశేషాలు …
- రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 0.9కిలో మీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్ నిర్మాణం
- ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లుక్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా రెండు స్టేషన్లు
- ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణం, తొలి దశలో మూడు బోగీలు మాత్రమే
- 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మియాపూర్ – అమీర్‌పేట 12 కిలోమీటర్లు, అమీర్‌పేట – నాగోలు 17 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించారు.
కీలక ఘట్టాలు

- 2018 సెప్టెంబర్ 24న అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమీర్‌పేట – ఎల్బీనగర్ 16 కి.మీ. మార్గాన్ని ప్రారంభించారు.
- 2019 మార్చి 20న అమీర్‌పేట – హైటెక్ సిటీ 10 కి.మీ మార్గాన్ని నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అందుబాటులోకి తెచ్చారు.
- 2019 నవంబర్ 29న హైటెక్ సిటీ – రాయదుర్గం 1.5 కిమీ మార్గాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
- 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ – ఎంజీబీఎస్ 10 కిలోమీటర్ల మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
- 2022 డిసెంబర్ 9న రెండోదశలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు.
ఇవీ ప్రత్యేకతలు :

- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో చేపట్టి పూర్తి చేసిన అతి పెద్ద ప్రాజెక్టు.
- హైదరాబాద్ మెట్రో రైల్ పొడవు 69.2 కిలోమీటర్లు
- మెట్రోలో రోజుకు సుమారుగా 4.90 లక్షల మంది ప్రయాణికులు
- 2600 పిల్లర్లు
- అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ దేశంలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్. 2 లక్షల చదరపు ఫీట్ల వైశాల్యంలో నిర్మించారు.
- లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఎంఎంటీఎస్, రైల్వే, సైకిళ్ల లాంటి రవాణా వ్యవస్థలతో అనుసంధానించిన ఏకైక ప్రాజెక్టు.
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ హైలెట్స్
- పొడవు:31 కిలోమీటర్లు (మొత్తం)
- ఎలివేటెడ్ వే: 27.5 కిలోమీటర్లు
- రోడ్ వే: 1 కిలోమీటర్
- అండర్ గ్రౌండ్ వే: 2.5 కిలోమీటర్లు
- వేగం: గరిష్ఠంగా 120 కిలోమీటర్లు
- ఫ్రీక్వెన్సీ: 2.5నిమిషాలు (పీక్ ఆవర్స్)
- సమయం:26 నిమిషాలు
- స్టేషన్లు: 8 లేదా 9 (ప్రతిపాదన ప్రకారం)
- ప్రారంభం: రాయదుర్గం టెర్మినల్ (నూతనంగా)
- నిర్మాణ సమయం: 36 నెలలు
- అంచనా వ్యయం: 6250 కోట్లు

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

