3 గంటలతో..మొదటి మడి తడుస్తదా..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్‌పీ మోటర్లుపెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పంపుసెట్లు ఉన్నవి. ఇవన్నీ కొనాలంటే రూ.30వేల కోట్లు కావాలి. అంతడబ్బు ఎవడు ఇవ్వాలి.
- కర్నాటక రైతులు గొడగొడ ఏడుస్తుండ్రు
- మరో ఐదు, పదేండ్లు మన పథకాలు అమలు కావాలి
- రానున్న రెండేండ్లలో ప్రతి ఎకరా.. పారించే బాధ్యత నాది
- భూమి ఉన్న రైతులంతా..కోటీశ్వరులయ్యారు..
- వాళ్లు చెప్పే మోటర్లు కొనాలంటే..రూ.30వేల కోట్లు కావాలి
- అంతడబ్బు ఎవడు ఇవ్వాలి
- ఎల్లారెడ్డి, మెదక్ ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్‌పీ మోటర్లుపెట్టుకోవాలని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పంపుసెట్లు ఉన్నవి. ఇవన్నీ కొనాలంటే రూ.30వేల కోట్లు కావాలి. అంతడబ్బు ఎవడు ఇవ్వాలి.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం అభ్యర్థి జాజుల సురేందర్, మెదక్ నియోజకవర్గం అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా పుట్టింది మీ కనుసన్నల్లోనే.. బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్లముందే ఉన్నది. రైతు బాగుంటేనే.. దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ తీసుకువచ్చి చెరువులు నింపినం. 24 గంటల కరెంటు ఇస్తున్నం. మంచినీళ్ల బాధలు తీర్చినం.. పంటలు, పరిశ్రమలు పెరిగాయి.. పెట్టుబడులు వస్తున్నయ్.. ఐటీ రంగం విస్తరించింది.. రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1 స్థానంలో నిలిచింది.

ధరణి, రైతుబంధు, 24 గంటల కరెంటుతో రైతుల ముఖం తెల్లవడుతున్నది. నాడు చప్రాసీ నౌకరి ఉన్నోడికి పిల్లను ఇచ్చారు.. ఇవాళ భూమి ఉన్నోడికే పిల్లను ఇస్తమంటున్నరు. ఇవన్నీ మరో ఐదు, పదేండ్లు అమలవుతే.. రైతులు కుదుటపడుతరు. తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలంటే పార్టీల నడవడిక, చరిత్ర గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులు నష్టపోతరు. మీ ఓటుతోనే.. మీ వేలితోనే మీ కన్ను పొడిపించాలని కాంగ్రెస్ చూస్తున్నది. ఆ పార్టీ నాయకులు అనాలోచితంగా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. ధరణి ఎత్తేస్తాం.. 3 గంటల కరెంటు ఇస్తాం, ఇదే మా పాలసీ అని చెబుతున్నరు. మూడు గంటల కరెంటుతో మొదటి మడి తడుస్తదా..? ఇదే దొంగ కాంగ్రెస్‌ను నమ్మి కర్ణాటక రైతులు ఓటేసి ఇప్పుడు గొడగొడ ఏడుస్తుండ్రు. ఇక్కడ మీరు కూడా మోసపోతే.. మళ్లీ గోసపడుతాం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రానున్న రెండేండ్లలో ఒక ఎకరం కూడా మిగలకుండా పారించే బాధ్యత నాది. అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

