సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి నటి షాలూ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా… దుండగుడు దాడిచేసి, ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయిన ఘటన తెలిసిందే. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. పాతనేరస్తులను ప్రశ్నించారు.
ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. అయితే అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, ఘటనకు పాల్పడిన నిందితుడి విషయంలో స్పష్టత రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు.